నా మనస్సంతా చీపురుపల్లె
చీపురుపల్లిలో టీడీపీకి భారీ మద్దతు.. *చిన్న శ్రీను సమక్షంలో 100 కుటుంబాలు టీడీపిలో చేరిక
*ఎక్కడ ఉన్నా నా మనసు చీపురుపల్లిలోనే ఉంటుంది.. * ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఎప్పుడైనా అందుబాటులో ఉంటా: చిన్న శ్రీను
చీపురుపల్లి మేజర్ న్యూస్: ఎక్కడ ఉన్నా... ఏమి చేసినా..
నా మనస్సంతా చీపురుపల్లి లోనే ఉంటుందని మాజీ జడ్పి చైర్మన్, అరకు పార్లమెంటు పరిశీలకులు మజ్జి శ్రీనివాసరావు ( చిన్న శ్రీను) అన్నారు.
చీపురుపల్లి నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గొల్లవీధిలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో
చీపురుపల్లి హెడ్ క్వార్టర్ సర్పంచ్ అభ్యర్థి రౌతు కామ నాయుడు తో కలిసి గొల్లవీధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించి స్థానిక ప్రజలను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా చిన్న శ్రీను సమక్షంలో సుమారు 100 కుటుంబాలకు చెందిన వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన చిన్న మాట్లాడుతూ...
"ఎక్కడ ఉన్నా నా మనసు ఎప్పుడూ చీపురుపల్లిలోనే ఉంటుంది. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే ప్రజలు మనకు అండగా నిలిచి విజయాన్ని అందించారో, అదే విధంగా రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నానన్నారు
చీపురుపల్లి ప్రజలకు ఏ అవసరం వచ్చినా, ఏ సమయంలోనైనా నేను అందుబాటులో ఉంటాను. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడైనా స్పందిస్తాను. చీపురుపల్లి ప్రజలతో నా అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుంది" అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వల్లి రెడ్డి శ్రీనివాసులు నాయుడు , ఎంపీటీసీలు, వార్డు మెంబర్ అభ్యర్థులు, వల్లి రెడ్డి లక్ష్మణ్ ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.