విద్యార్థుల కడుపులోకి దూసుకెళ్లిన కమ్మీలు
అన్నమయ్య జిల్లా మదనపల్లి అంగళ్లు చేనేత నగర్ వద్ద బుధవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా మారింది. అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన నిశాంత్(22), ధర్మవరం శాంతినగర్‌కు చెందిన మోహనకృష్ణ(23) అంగళ్ళు మిట్స్ కాలేజీలో ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతున్నారు. మదనపల్లె నుంచి అంగళ్లులోని హాస్టల్‌కు వెళ్తుండగా, వాహనాన్ని అధిగమించబోయి కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డివైడర్ ఇనుప కమ్మీలు ఇద్దరు విద్యార్థుల కడుపులోకి దూసుకెళ్లి బయటకు వచ్చాయి. స్థానికులు గమనించి వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రధమ చికిత్సల అనంతరం తిరుపతి రుయాకు రెఫర్ చేశారు.