విద్యుదాఘాతంతో యువకుని మృతి
వెల్దుర్తి, (రూరల్ న్యూస్ ): మండల కేంద్రమై పట్టణంలోని ఐజీ నగరంలో నివాసముండే బోయ రాందాసు (25) మంగళవారం 44వ జాతీయ రహదారి ప్రక్కనగల డోన్ రోడ్డులో ఈద్గా వద్ద కొత్తగా పంక్చర్ షాపుకు రేకులు షెడ్డు వేసుకునే సమయంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం 44వ జాతీయ రహదారి హనుమాన్ జంక్షన్ సమీపంలో ఉన్న పంక్చర్ షాపును మార్చుకునే క్రమంలో రాందాసు తన తండ్రి రామ్‌కిట్టు, సోదరుడు సాయిరాంతో కలిసి ఈద్గా వద్ద ఈ మధ్యకాలంలోనే స్థలం సొంతంగా తీసుకొని రేకుల షెడ్డు పనులు దాదాపు పూర్తి చేసుకునే సమయంలో మిగిలి ఉన్న రేకులను తీయబోతున్న క్రమంలో రాందాసు పొరపాటుగా రేకును పైకి లేపగా, పైన ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ ఇండక్షన్ ప్రభావంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన సమీప సీహెచ్‌సీకి తరలించగా, కోలుకోలేక మృతి చెందాడు. మృతునికి భార్య, మూడు నెలల కుమార్తె ఉన్నారు.