BREAKING
విజ్ఞాన మేధావి ఆజాద్ ‎భారత దేశ ప్రప్రథమ విద్యాశాఖా మంత్రి ‎"మౌలానా అబుల్ కలామ్ ఆజాద్" ‎జన్మదినోత్సవం ఆర్మూర్ "బల్దియా"లో అక్రమ నిర్మాణాల జోరు...అదుపుచేయ"లేక"పోతున్న అధికారులు. 11 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ: పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఆగని అక్రమ నిర్మాణాలు.నోటీసులకే పరిమితమైన పంచాయతీ. మండల కేంద్రంలో ఆగని అక్రమ నిర్మాణాలు. తిరుమలలో భక్తుల రద్దీ: సర్వదర్శనానికి 15 గంటల సమయం అభివృద్ధి ,సంక్షేమ పథకాలే కూటమిని గెలిపించాయి అసోంలో తప్పిన పెను ప్రమాదం: పట్టాలు తప్పిన సైరాంగ్ ఎక్స్‌ప్రెస్, ఏడుగురికి గాయాలు నేడు విశాఖకు సీఎం చంద్రబాబు భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన దాంపత్య వ్రత మహోత్సవం పిల్స్‌బరీ డౌబోయ్ వాయిస్ ఆర్టిస్ట్ జోబీ సెర్నీ కన్నుమూత: చాకలి ఐలమ్మ విగ్రహానికి లక్ష రూపాయలు విరాళం అందజేత 'వారు కూడా మనుషులేనని గుర్తుంచుకోవాలి': పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల ప్రకటనపై రేణు దేశాయ్ స్పందన సల్మాన్ ఖాన్ 'మాతృభూమి' ట్రైలర్‌పై మిశ్రమ స్పందనలు వ్యాపార విస్తరణ-దౌత్య యుద్ధాలు

అభివృద్ధి ,సంక్షేమ పథకాలే కూటమిని గెలిపించాయి

Select Suryaa Now
అభివృద్ధి ,సంక్షేమ పథకాలే కూటమిని గెలిపించాయి

అభివృద్ధి, సంక్షేమ పథకాలే కూటమి గెలుపుకు దోహదం 

ఆత్మకూరు మండల టీడీపీ కన్వీనర్ గంతి శ్రీనివాసులు

అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ : గత రెండున్నర ఏళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఎంపిటిసి ,జడ్పిటిసి, ఎన్నికల్లో అద్భుత విజయాలకు  కారణమని   టిడిపి ఆత్మకూరు మండల కన్వీనర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఎంపీటీసీలు, జడ్పిటిసిలుగా గెలుపొందిన వారికి ఆయన   అభినందనలు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ, ఆత్మకూరు మండలం లోని టిడిపి నుంచి జడ్పీటీసీ అభ్యర్థి బండి పరుశురామ్ సతీమణి బండి భారతి తో పాటు , మండలం లోని 11ఎంపీటీసీ లకు గాను 9 ఎంపిటిసి స్థానాలు గెలుపొందడం హర్షించదగ్గ విషయం అన్నారు. గెలుపొందిన 9 ఎంపిటిసి స్థానాల్లో 4 ఎంపిటిసి స్థానాలు ఏకగ్రీవం కావడం తో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి నియోజకవర్గంలో చేసిన అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు కు నిలువుటద్దంగా వైసిపి ఓటమికి కారణమయ్యాన్నారు. 
అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అండగా మా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ, యువ నేత శ్రీరామ్   అండగా ఉంటుందని ఆయన తెలిపారు. గత రెండున్నర ఏళ్లలో మా కూటమి ప్రభుత్వం రాప్తాడు నియోజకవర్గంలో, అన్నీ మండలాల్లోను మరిన్ని అభివృద్ధి పనులు చేసిందని, మరింత అభివృద్ధి పనులు చేయనున్నదని తెలిపారు. ప్రజలు అందించిన తీర్పు,అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పట్ల వారికున్న ఆదరణకు నిదర్శనం అనీ ఆయన పేర్కొన్నారు. మండలంలోని గ్రామాల్లో చేసిన అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు ప్రజలకు అందిస్తున్న సంక్షేమపథకాలు అందించడంతో, ప్రభుత్వంపై ప్రజలు మరింత విశ్వాసం పెంచారని కొనియాడారు. నియోజకవర్గ , మండల ప్రజలు మద్దతుతో లభించిన ఈ విజయాన్ని మరింత బాధ్యత స్వీకరించి, ప్రజా సంక్షేమం కోసం గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని గెలిచిన అభ్యర్థులను కోరారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో జరిగిన మునిసిపల్ స్థానిక పంచాయతీ ఎన్నికల్లో  కూటమి ప్రభుత్వ అభ్యర్థులు అధికంగా గెలిపించారన్నారు. ప్రస్తుతం గెలుపొందిన  జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థులు  గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజా అవసరాలను గుర్తించి, పల్లెలకు రోడ్డు నిర్మాణం, త్రాగునీరు,పారిశుధ్యం,తదితరాంశాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అభివృద్ధి సంక్షేమని సమన్వయం చేస్తూ, మెరుగైన పాలనందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన  అభ్యర్థులు ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అభ్యర్థులకు సూచించారు. ఆత్మకూరు మండలం జడ్పిటిసి,ఎంపిటిసి స్థానాలు గెలుపుకు సహకరించిన టిడిపి నాయకులకు కార్యకర్తలకు, మండల ప్రజలకు శ్రీనివాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.