BREAKING
యూరప్ మార్కెట్లలో సానుకూల ధోరణి.. ఏఐ టెక్నాలజీ షేర్లకు భారీ డిమాండ్! వీసీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీసుల భారీ మోహరింపు ఇమ్రాన్ ఖాన్ కు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స.. మళ్లీ అడియాలా జైలుకు తరలింపు! విజ్ఞాన మేధావి ఆజాద్ ‎భారత దేశ ప్రప్రథమ విద్యాశాఖా మంత్రి ‎"మౌలానా అబుల్ కలామ్ ఆజాద్" ‎జన్మదినోత్సవం ఆర్మూర్ "బల్దియా"లో అక్రమ నిర్మాణాల జోరు...అదుపుచేయ"లేక"పోతున్న అధికారులు. 11 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ: పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఆగని అక్రమ నిర్మాణాలు.నోటీసులకే పరిమితమైన పంచాయతీ. మండల కేంద్రంలో ఆగని అక్రమ నిర్మాణాలు. తిరుమలలో భక్తుల రద్దీ: సర్వదర్శనానికి 15 గంటల సమయం అభివృద్ధి ,సంక్షేమ పథకాలే కూటమిని గెలిపించాయి అసోంలో తప్పిన పెను ప్రమాదం: పట్టాలు తప్పిన సైరాంగ్ ఎక్స్‌ప్రెస్, ఏడుగురికి గాయాలు నేడు విశాఖకు సీఎం చంద్రబాబు భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన దాంపత్య వ్రత మహోత్సవం పిల్స్‌బరీ డౌబోయ్ వాయిస్ ఆర్టిస్ట్ జోబీ సెర్నీ కన్నుమూత: చాకలి ఐలమ్మ విగ్రహానికి లక్ష రూపాయలు విరాళం అందజేత

ఆగని అక్రమ నిర్మాణాలు.నోటీసులకే పరిమితమైన పంచాయతీ.

Select Suryaa Now
ఆగని అక్రమ నిర్మాణాలు.నోటీసులకే పరిమితమైన పంచాయతీ.

మండల కేంద్రంలో ఆగని అక్రమ నిర్మాణాలు.

* దుమ్ముగూడెం లక్ష్మీనగరం గ్రామపంచాయతీల్లో బహుళ నిర్మాణాలు.

* నోటీసులకే పరిమితమైన పంచాయతీ యంత్రాంగం.

దుమ్ముగూడెం సూర్య (మేజర్ న్యూస్)::

మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న బహుళ అంతస్తుల నిర్మాణాలపై అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. రోజు రోజుకి అడ్డు అదుపు లేకుండా జోరుగా సాగుతున్న అక్రమ నిర్మాణ నిర్మాణాల పరిస్థితి చూస్తుంటే 1/70 చట్టం, ఏజెన్సీ చట్టాలు ఉన్నాయా ఎత్తేశారు అన్న అనుమానం కలగక మానదు.అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగం కేవలం నోటీసులకే పరిమితమవుతుండటంపై ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఏజెన్సీ చట్టాలను కాపాడలేని అధికార యంత్రాంగం ఆమాత్రం నోటీసులు ఇవ్వడం ఎందుకని ఆదివాసి సంఘాల నాయకులు పెదవి విరుస్తున్నారు.  గతంలో ములకపాడు పంచాయతీలో ఇన్‌ఛార్జ్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న అధికారులు,నేడు దుమ్ముగూడెం మండల కేంద్రంలో బహుళ అంతస్తుల నిర్మాణాల విషయంలోనూ అదే తీరును పునరావృతం చేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.ఏజెన్సీ ప్రాంతాల్లో చట్టాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన అధికారులు, గిరిజనుల సంక్షేమం మరియు అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో మాత్రం రకరకాల సాకులు చూపుతూ అడ్డంకులు సృష్టిస్తున్నారు. కానీ, వ్యాపార ప్రాతిపదికన ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తూ, గ్రామపంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా నిర్మిస్తున్న భారీ అక్రమ కట్టడాలపై మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

*కళ్లముందే అక్రమాలు..*

మండల ప్రధాన కేంద్రంలోని లక్ష్మీనగరం - దుమ్ముగూడెం క్రాస్ రోడ్ వద్ద ప్రధాన రహదారి పక్కనే కళ్లముందు బహుళ అంతస్తుల భవనాలు రూపుదిద్దుకుంటున్నా పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఆదివాసీ సంఘాల నాయకులు స్వయంగా ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే అధికారులు హడావుడిగా వెళ్లి నోటీసులు ఇస్తున్నారని, ఆ తర్వాత ఎటువంటి తదుపరి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అధికారుల ఈ నిర్లక్ష్య వైఖరి వెనుక భారీగా ముడుపులు ముట్టాయనే చర్చ మండలంలో బహిరంగంగానే సాగుతోంది.ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా, పంచాయతీ అనుమతులు లేకుండా చేపడుతున్న భవన నిర్మాణాలను తక్షణమే నిలిపివేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.