BREAKING
వెబ్ సిరీస్ కోసం గుండుతో కనిపించనున్న హుమా ఖురేషి.. అసలు కారణం వెల్లడించిన ప్రముఖ నటి! శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలకు పరిశోధనలు దోహదం చేయాలి – ప్రముఖ విద్యావేత్తలు - కళాశాలలో జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభం ఆస్కార్‌ రేసులో 'పైర్‌' సినిమా.. స్వతంత్ర ఎంట్రీగా నామినేషన్ దాఖలు చేసిన దర్శకుడు వినోద్ కాప్రీ! కొచెల్లా వేదికపై మరోసారి దిల్జిత్ దోసాంజ్ సంచలనం.. హెడ్‌లైన్లుగా మడోన్నా, దువా లిపా! సూర్య సినిమా లీక్ వార్తలపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. ఆందోళన చెందానంటూ షాకింగ్ కామెంట్స్! నా కెరీర్‌లోనే ఇది అద్భుతమైన సంవత్సరం.. ప్రముఖ నటి దివ్య దత్తా సంచలన వ్యాఖ్యలు! తల్లి దండ్రులను పోషించని కొడుకు ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు రూ.632 కోట్లతో ఎత్తిపోతల పథకాల మరమ్మతులు విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమని చాటిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ బియ్యం బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలి మార్వెల్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ అప్‌డేట్.. అవెంజర్స్ డూమ్‌డేలో స్కార్లెట్ విచ్ రీఎంట్రీ! కుల్గామ్‌లో సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌పై కాల్పులు కిడ్నీ బాధితురాలికి రూ.4 లక్షల ఎల్‌ఓసీ మంజూరు వెల్దుర్తి అభివృద్ధికి కట్టుబడి ఉంటా... మాజీ జడ్పిటిసి వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి ఎల్ఈ.పుష్పావతి

34 ఏళ్ల సేవకు తోటి హోంగార్డుల ఆపన్నహస్తం: పదవీ విరమణ పొందిన హోంగార్డుకు రూ. 4.95 లక్షల ఆర్థిక సాయం

Select Suryaa Now
34 ఏళ్ల సేవకు తోటి హోంగార్డుల ఆపన్నహస్తం: పదవీ విరమణ పొందిన హోంగార్డుకు రూ. 4.95 లక్షల ఆర్థిక సాయం

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : అనంతపురం జిల్లా పోలీస్ శాఖలో సుమారు 34 సంవత్సరాల పాటు నిరంతర సేవలందించి పదవీ విరమణ పొందిన హోంగార్డు ఎస్. ఒబులేసుకు తోటి హోంగార్డులు తమ మానవీయతను చాటుతూ అండగా నిలిచారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలోని హోంగార్డులందరూ తమ ఒక రోజు జీతాన్ని విరాళంగా సేకరించి, మొత్తం రూ. 4,95,580 ఆర్థిక సాయాన్ని సమకూర్చారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ పి. జగదీష్, IPS చేతుల మీదుగా ఒబులేసుకు అందజేశారు.

​హోంగార్డుల మానవతా దృక్పథాన్ని అభినందించిన ఎస్పీ

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పి. జగదీష్ మాట్లాడుతూ.. తోటి హోంగార్డు పదవీ విరమణ పొందిన వేళ ఆయనకు అండగా నిలిచి ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని కొనియాడారు. పోలీస్ కుటుంబంలో ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. 34 ఏళ్ల పాటు పోలీస్ శాఖకు ఒబులేసు అందించిన సేవలను ఎస్పీ ప్రత్యేకంగా ప్రశంసించారు. పదవీ విరమణ అనంతరం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

​ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, ఆర్‌ఐ పవన్ కుమార్, ఆర్‌ఎస్‌ఐ జాఫర్ తో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

రిపోర్టర్ మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్