BREAKING
గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కంటెంట్‌ను నమ్ముకుని బరిలోకి 'మాయలేడి'.. నవంబర్ 13న రాకేష్ వర్రే కొత్త సినిమా విడుదల! బాలల దినోత్సవం కానుకగా ‘జయంత్ అండ్ ది జింగో పెన్’.. తారే జమీన్ పర్ తరహాలో అద్భుత చిత్రం! తెలంగాణలో 10+2 విద్యా విధానం అమలుకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు నవంబర్ రేసు నుంచి తప్పుకున్న చిత్రాలు.. విడుదలకు ఒక్కరోజు ముందే 'అ' మూవీ వాయిదా! విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి పెద్దపల్లి డిసిపి భూక్య రాంరెడ్డి ఆజాద్ బాటలో విద్యాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం - మైనార్టీ నాయకులు కోర్టు వివాదాలు క్లియర్: ఈ నెల 26న ఏపీలో 23 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 'ఆదర్శ కుటుంబం' హీరోయిన్ గ్లామరస్ ఫోటోలు.. నెట్టింట వైరల్! వెబ్ సిరీస్ కోసం గుండుతో కనిపించనున్న హుమా ఖురేషి.. అసలు కారణం వెల్లడించిన ప్రముఖ నటి! శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలకు పరిశోధనలు దోహదం చేయాలి – ప్రముఖ విద్యావేత్తలు - కళాశాలలో జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభం ఆస్కార్‌ రేసులో 'పైర్‌' సినిమా.. స్వతంత్ర ఎంట్రీగా నామినేషన్ దాఖలు చేసిన దర్శకుడు వినోద్ కాప్రీ! కొచెల్లా వేదికపై మరోసారి దిల్జిత్ దోసాంజ్ సంచలనం.. హెడ్‌లైన్లుగా మడోన్నా, దువా లిపా! సూర్య సినిమా లీక్ వార్తలపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. ఆందోళన చెందానంటూ షాకింగ్ కామెంట్స్! నా కెరీర్‌లోనే ఇది అద్భుతమైన సంవత్సరం.. ప్రముఖ నటి దివ్య దత్తా సంచలన వ్యాఖ్యలు!

సిమ్స్ ఆసుపత్రి యాజమాన్యానికి జిజిహెచ్ సూపరింటెండెంట్ ఘన సన్మానం

Select Suryaa Now
సిమ్స్ ఆసుపత్రి యాజమాన్యానికి జిజిహెచ్ సూపరింటెండెంట్ ఘన సన్మానం

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH) అభివృద్ధికి తమ వంతు సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందించిన సిమ్స్ ఆసుపత్రి యాజమాన్యాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి ఘనంగా సన్మానించారు.

​సుమారు రూ. 3 లక్షల వ్యయంతో ఆసుపత్రికి అవసరమైన ఫర్నిచర్‌ను విరాళంగా అందజేసిన సిమ్స్ ఆసుపత్రి మేనేజ్‌మెంట్ ప్రతినిధులు జి. రామకృష్ణారెడ్డి, డాక్టర్ జి. స్వరూప రెడ్డి, డాక్టర్ ఎం. అశ్వర్థరెడ్డిలను సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.

​ఈ సందర్భంగా డాక్టర్ మల్లీశ్వరి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద రోగతులకు మెరుగైన వసతులు కల్పించేందుకు సిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం రూ. 3 లక్షల విలువైన ఫర్నిచర్ అందించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. వారి ఉదారతకు జీజీహెచ్ యాజమాన్యం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు, కార్పొరేట్ సంస్థలు ఇలాగే ముందుకు వచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.