విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి పెద్దపల్లి డిసిపి భూక్య రాంరెడ్డి
సూర్య సుల్తానాబాద్
విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పెద్దపల్లి డిసిపి భూక్య రామ్ రెడ్డి అన్నారు. బుధవారం సుల్తానాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో మండలంలోని గర్రెపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన సదస్సు ను నిర్వహించారు.
ముఖ్య అతిథిగా పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, ప్రవచనకర్త ఎస్పీ నాయక్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్ , గంజాయి మత్తు పదార్థాలకు అలవాటు పడితే కలిగే అనర్థాల గురించి వివరించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచి లక్ష్యాలతో జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా ముందుకు సాగాలని తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సమాజంలో గొప్పగా బ్రతికి సామాజిక సేవలో ముందుండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు, ఎస్ఐ చంద్రకుమార్, ఎలిగేడు ఎస్ఐ మధుకర్,
కాశ్రీరాంపూర్ ఎస్ఐ సుధాకర్, పోలీసు సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.