తెలంగాణ కవులను, కళాకారులను బిఆర్ఎస్ గౌరవించింది - కేటీఆర్
సూర్య- బిక్కనూర్ : రాష్ట్ర సాధనకు తమ వంతుగా కృషి చేసిన కవులను, కళాకారులను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత బిఆర్ఎస్ పార్టీ కల్పించిందని,బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. బుధవారం మండలంలోని పొందుర్తి చెక్ పోస్ట్ వద్ద క్యాసంపల్లి గ్రామానికి చెందిన జానపద గాయకుడు సంగి రఘు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై నూతనంగా రూపొందించిన పాట సిడిని కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుస్తామని, పగటి కలలు కంటున్నాడని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రేవంత్ రెడ్డి తో సహా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ ఓటమి ఖాయమన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పాట పాడిన రఘును అభినందించారు రాబోవు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రపై అభివృద్ధిపై మరెన్నో పాటలు పాడాలని రఘుకు సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎం.కె ముజిబుద్దీన్, బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గూడెం బాలరాజ్, బిఆర్ఎస్ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు చెలిమెల భాను ప్రసాద్, క్యాసంపల్లి సర్పంచ్ అడప శ్యామ్ తదితరులు పాల్గొన్నారు