రూ.60 లక్షలతో నిర్మించిన మల్టీపర్పస్ సెంటర్ను ప్రారంభించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్
కుల్కచర్ల, మేజర్ న్యూస్:గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి అన్నారు. కుల్కచర్ల మండలం రాంపూర్ గ్రామంలో రూ.60 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన మల్టీపర్పస్ సెంటర్ను బుధవారం ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గ్రామీణ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో భాగంగా నిర్మించిన ఈ మల్టీపర్పస్ సెంటర్ గ్రామ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన పనులను ప్రాధాన్యత క్రమంలో చేపడుతూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన మల్టీపర్పస్ సెంటర్ను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు కరణం ప్రహ్లాద్ రావు, పీఏసీఎస్ చైర్మన్ బోలుసాని భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బి.ఎస్. ఆంజనేయులు ముదిరాజ్, కాంగ్రెస్ బ్లాక్-2 అధ్యక్షుడు కర్రె భరత్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్, స్థానిక సర్పంచ్ తిరుపతయ్య, మండల నాయకులు, వివిధ పార్టీల కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.