telangana
కరీంనగర్ మహా పాదయాత్రను విజయవంతం చేయాలి - బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జ శ్రీనివాసరావు
సూర్య తిమ్మాపూర్ : ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. బుధవారం నల్గొండ గ్రామంలో మండల అధ్యక్షుడు చింతం శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 18న కరీంనగర్‌లో నిర్వహించే మహా పాదయాత్రకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ హాజరవుతున్నారని, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర మాట్లాడుతూ కాంగ్రెస్ రాజకీయ ఉనికి కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.
ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మువ్వరపు సంపత్, బూట్ల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి గొట్టె ముక్కుల తిరుపతి రెడ్డి, వేల్పుల ఓదేలు యాదవ్, బొనాల మోహన్, కొయ్యడ శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, శేఖర్, ఎర్రోజు లక్ష్మణ్, రాజేష్, ఎ. స్వామి, శ్రీను, జాడి రాజు, మహేందర్ రెడ్డి, రవికుమార్, ప్రణయ్, సుగుణాకర్, అజయ్, నరేష్, కామెరా వెంకటేష్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.