BREAKING
జబర్దస్త్ శ్రీవిద్య సంచలన వ్యాఖ్యలు.. కెరీర్ ప్రారంభంలో పడిన కష్టాలు, వైరల్ ఫేమ్ వెనుక అసలు నిజాలు వృత్తి విద్యా ఉపాధ్యాయులకు మూడు రోజుల కౌశల్ బోధ్ శిక్షణ స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం.. వత్సవాయి మండలంలో రెండో విడతకు గ్రామ పంచాయతీ ఎన్నికలు నవంబర్ 29న పోలింగ్.. 18 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ అసత్య ఆరోపణలు వ్యక్తిగత విమర్శలు కాదు.. అభివృద్ధిపై చర్చకు రండి ఎమ్మెల్యే సంజీవరెడ్డి కి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సవాల్ నయనతారపై టాలీవుడ్ డైరెక్టర్ మారుతి సంచలన వ్యాఖ్యలు.. ఆ స్టార్ హీరోయిన్‌కు అంత పొగరా? విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను తొలగించండి తీపర్రు ఎంపీటీసీ కరటూరి సుబ్బారావుకు బూరుగుపల్లి శేషారావు అభినందనలు దివ్యాంగుల సమస్యలు పరిష్కరించకుంటే మరో ఉద్యమం మృత్యువుకే ఎదురెళ్ళి గెలిచిన వీరనారీమణులు.. క్యాన్సర్‌ను జయించి స్ఫూర్తిగా నిలిచిన హీరోయిన్స్ సొంత పార్టీ ఎంపీ కార్యక్రమానికి వెళ్తే సస్పెండ్ చేస్తారా? ఏకపక్ష సస్పెన్షన్‌ను వెంటనే రద్దు చేయాలి జీబీఆర్‌లో క్రీడా సందడి.. విద్యార్థుల్లో ఉత్సాహం. సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కాట సుధా శ్రీనివాస్ గౌడ్ మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ నైజాం రైట్స్ సంచలనం.. రూ.35 కోట్ల భారీ డీల్‌ను దక్కించుకున్న ఏషియన్ సినిమాస్! కరువు రైతులకు రుణ ఉపశమనం కల్పించాలి! బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి..జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్ సూచనలు

విశాఖపట్నం వైద్యుల అరుదైన ఘనత: హైదరాబాద్ మహిళకు సంక్లిష్టమైన వెన్నుపాము కణితి తొలగింపు

Select Suryaa Now
విశాఖపట్నం వైద్యుల అరుదైన ఘనత: హైదరాబాద్ మహిళకు సంక్లిష్టమైన వెన్నుపాము కణితి తొలగింపు

సీతమ్మధార, సూర్య : హైదరాబాద్‌కు చెందిన 45 ఏళ్ల మహిళకు విశాఖపట్నంలోని సాయి స్ఫూర్తి హాస్పిటల్ వైద్యులు అరుదైన, సంక్లిష్టమైన వెన్నెముక శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. హైదరాబాద్ వాసి అయిన  మంగమ్మ (45) రెండు కాళ్లలో బలహీనత కారణంగా నడవలేని స్థితిలో మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని ప్రముఖ స్పైన్ సర్జన్ డా. అరుణ్ కుమార్  సంప్రదించారు. పరీక్షల్లో ఆమె వెన్నుపాము కాలువలో (టీ8 స్థాయిలో) 'ఇంట్రాడ్యూరల్ స్పైనల్ ట్యూమర్' (కణితి) ఉన్నట్లు తేలింది. నవంబర్ 3న డా. అరుణ్ కుమార్ వి, డా. శరత్ బాబు, డా. గాయత్రిలతో కూడిన వైద్య బృందం అత్యంత క్లిష్టమైన మైక్రోసర్జరీ ద్వారా నాడీ వ్యవస్థకు ఎలాంటి హాని కలగకుండా కణితిని పూర్తిగా తొలగించింది. శస్త్రచికిత్స అనంతరం వేగంగా కోలుకున్న మంగమ్మ , ఇప్పుడు ఎవరి ఆధారం లేకుండా స్వతంత్రంగా నడుస్తున్నారు. ఈ సందర్భంగా డా. అరుణ్ కుమార్ వి మాట్లాడుతూ, "సకాలంలో వ్యాధి నిర్ధారణ, ఖచ్చితమైన మైక్రోసర్జికల్ పద్ధతుల వల్ల రోగి నాడీ వ్యవస్థను కాపాడుతూ కణితిని విజయవంతంగా తొలగించగలిగాము. హైదరాబాద్ నుండి వచ్చి మాపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు" అని తెలిపారు.