BREAKING
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శాంత్ కుమార్ మార్కాపురం తొలి జెడ్పీ చైర్మన్‌కు ఘన సన్మానం *దేశిని చిన మల్లయ్య సేవలు చిరస్మరణీయం ఘనంగా 9వ, వర్ధంతి వేడుకలు* సేవకు గుర్తింపు .. పువ్వాడికి పట్టం! వచ్చే జూన్ వరకు జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి* *గాజులదిన్నె ప్రాజెక్ట్, సుంకేసుల ప్రాజెక్ట్ లలో ఉన్న నీటిని తాగునీటికి మాత్రమే వినియోగించాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* తాటిచర్లమోటులో ‘నారాయణమ్మ హోటల్’ ప్రారంభం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి రోడ్డు ప్రమాదాల నివారణకు గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద భద్రతా చర్యలు వేగవంతం చేయాలి* *పెండింగ్ రోడ్డు నిర్మాణాలు, విస్తరణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* విశాఖ వేదికగా రూ.11 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం! PMR హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్‌పై సమగ్ర విచారణ జరిపించాలి :ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు హేమా సుదర్శన్ జిల్లోజు డిమాండ్ సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన నగర మేయర్ రమేష్ గౌడ్ భూ రికార్డుల్లో తప్పులకు తావొద్దు జనవరి 31లోగా గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి చేయాలి అధిక ధరలకు నిత్యావసరాల విక్రయం.. 10 కేసులు నమోదు ఇదులగూడ జంక్షన్‌లో 100 ఫీట్ల సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం వలస సుభాష్ చంద్రబోస్ ను పరామర్శించిన బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు ముదుగంటి విష్ణువర్ధన్ రెడ్డి

మాటలతో కాదు చేతల్లో అభివృద్ధి చేసి చూపిస్తాం ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Select Suryaa Now
మాటలతో కాదు చేతల్లో అభివృద్ధి చేసి చూపిస్తాం ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణఖేడ్ : నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ముందుకు సాగుతున్నామని, గతంలో పదేళ్ల పాటు అధికారంలో ఉండి చేయలేని పనులను తాము కేవలం మూడేళ్లలోపు పూర్తి చేసే దిశగా కృషి చేస్తున్నామని నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి చేసిన విమర్శలకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్పందిస్తూ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, మంజూరైన నిధులు, భవిష్యత్తులో చేపట్టనున్న ప్రాజెక్టుల వివరాలను వెల్లడించారు. నారాయణఖేడ్ నియోజకవర్గ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో సుమారు రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ స్థాయిలో విద్యా సంస్థను నారాయణఖేడ్‌కు తీసుకురావాలనే ఆలోచన గతంలో పదేళ్లు అధికారంలో ఉన్న నాయకులకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. నారాయణఖేడ్ పట్టణ పరిధిలో ఉన్న సుమారు 350 ఎకరాల అటవీ భూమిని గుర్తించి, దానిని అద్భుతమైన అర్బన్ ఫారెస్ట్ పార్కుగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయించామని తెలిపారు. భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చదనం అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి మంజూరైన ప్రధాన నిధులు రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్.
రూ.5 కోట్లతో అర్బన్ ఫారెస్ట్ పార్క్.
రూ.5 కోట్లతో ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియం.
రూ.47 కోట్లతో ఏటీసీ సెంటర్.
రూ.2 కోట్లతో సాయిల్ టెస్టింగ్ ల్యాబ్
5 కోట్లతో కమలాపూర్ చెరువులో బోటింగ్ మరియు ఇతర బుద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది
రూ.65 కోట్లతో సింగూరు నుంచి నల్లవాగు వరకు కెనాల్ నిర్మాణ ప్రతిపాదనకు నిధులు మంజూరు కాగా, త్వరలోనే జీవో విడుదల కానుంది.
పట్టణంలో రూ.16.28 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, మంగల్‌పేట నుంచి రాజీవ్ చౌక్ వరకు రూ.15 కోట్లతో మురుగునీటి కాల్వలు, సీసీ రోడ్లు, రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఇవే కాకుండా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాల మౌలిక సదుపాయాలు, రైతు సంక్షేమ పనులకు ప్రాధాన్యం ఇస్తున్నాము. నారాయణఖేడ్ నియోజకవర్గంలో భూగర్భ జలాలు పెంపొందించడంతో పాటు ప్రతి మండలానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో మినీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సింగూరు నుంచి నేరుగా నల్లవాగు వరకు కెనాల్ నిర్మాణం చేపట్టడం ద్వారా సాగునీరు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నారాయణఖేడ పట్టణ రింగ్‌రోడ్డు పనులు ప్రజల సహకారంతోనే చేపట్టబడ్డాయి. ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి స్థానిక రైతులు స్వచ్ఛందంగా భూమి అందించడం జరిగింది. ఇది ప్రజల సహకారంతో సాగుతున్న అభివృద్ధి పని రింగ్‌రోడ్డు అంటే పట్టణానికి అవసరమైన అంతర్గత రవాణా సౌకర్యం, ట్రాఫిక్ నియంత్రణ, పట్టణ విస్తరణకు తోడ్పడే రోడ్డు. ప్రస్తుత పనులు ప్రజల అవసరాలు, భూమి లభ్యత, నిధుల లభ్యతను దృష్టిలో ఉంచి దశలవారీగా చేపట్టబడుతున్నాయి భవిష్యత్తులో పట్టణానికి అవసరమైన విస్తృత రింగ్‌రోడ్డు, బైపాస్ పనుల కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాము. నారాయణఖేడ రింగ్‌రోడ్డు, బైపాస్ పనులను త్వరలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే ఇప్పటికే ప్రకటించారు నారాయణఖేడ్ పట్టణ రింగ్‌రోడ్డు నిర్మాణంపై మాజీ ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే ఖండించారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల భూములు కోల్పోతున్న రైతులతో స్వయంగా చర్చించి, వారి అంగీకారం, సహకారంతోనే పనులు చేపడుతున్నామని వివరించారు. ఈ ప్రాంతంలో చిన్నచిన్న భూములు కలిగిన రైతులు సైతం తమ భూమిలో కొంత భాగం ఇచ్చైనా సరే రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని తెలిపారు. స్థానిక కౌన్సిలర్లు, నాయకులు, కాలనీవాసులు కూడా రింగ్‌రోడ్డు నిర్మాణానికి సహకరిస్తున్నారని చెప్పారు. 100 అడుగుల వెడల్పుతో రోడ్డు వేయాలని మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యేకు క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితులు, భూముల స్వరూపం గురించి తెలుసా అభివృద్ధి అనేది ప్రజల అవసరాలు, రైతుల అభిప్రాయాలు, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని జరగాలని అన్నారు. బానాపూర్, జి.హుక్రాన్ వెంకటాపూర్ గ్రామాల పేరుతో రూ.1.65 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు చేసిన ఆరోపణ పూర్తిగా తప్పు. ఈ నిధులు ఏ పనులకు మంజూరయ్యాయో, ఎక్కడ జరిగాయో, ఎవరు పర్యవేక్షించారో, ఏ శాఖ పరిధిలో ఉన్నాయో అన్ని వివరాలు అధికారిక రికార్డుల్లో ఉన్నాయి. ఏ పని జరగలేదని, రికార్డులు తప్పుగా నమోదయ్యాయని ఆరోపించే ముందు భూపాల్ రెడ్డి సంబంధిత పని ఆర్డర్లు, మీజాన్‌బుక్‌లు, ఫోటోలు, జియో-ట్యాగ్ ఆధారాలు, బిల్లులు బహిరంగంగా చూపించాలి. ప్రజాధనానికి భంగం జరిగితే దానిని దాచడం లేదు అయితే ఊహాజనిత ఆరోపణలతో ప్రజలను గందరగోళానికి గురిచేయడం సమంజసం కాదు. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడే ముందు గత పదేళ్ల పాలనలో జరిగిన భూ వ్యవహారాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులు, ప్రభుత్వ భూముల పంపిణీపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో మునిగిన భూములకు సంబంధించిన రికార్డులు, ధరణిలో భూముల నమోదు, ప్రభుత్వ భూముల వ్యవహారాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై సంబంధిత రికార్డులు, ఆధారాలతో విచారణ జరగాలని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గతంలో చేసిన అభివృద్ధిని ప్రజలు చూశారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను కూడా ప్రజలు ప్రత్యక్షంగా గమనిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. మున్సిపాలిటీకి అందించిన యంత్రాలు, వాహనాలు ప్రజల సొత్తే. వాటిని ప్రైవేట్ పనులకు వినియోగిస్తున్నట్లు నిర్ధారణ అయితే తక్షణమే తగిన చర్య తీసుకుంటాము. అయితే, ఆధారం లేకుండా ప్రజా సంస్థల పనితీరును దూషించడం సరికాదు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు చేపడుతుంటే వాటికి సహకరించాల్సింది పోయి, రాజకీయ విమర్శలతో ప్రజల్లో అపోహలు సృష్టించడం సరికాదన్నారు. నారాయణఖేడ్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మరిన్ని నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. మాటలతో కాదు.. చేతల్లో అభివృద్ధి చేసి చూపిస్తాం. రాజకీయ విమర్శలకు భయపడేది లేదు.. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే మా లక్ష్యం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ దేవుడు అన్నీ గమనిస్తూనే ఉంటాడని, ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు ఎవరు రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు? అనేది ప్రజలకు తెలుసని, ప్రజల ఆశీర్వాదంతో నారాయణఖేడ్ అభివృద్ధి ప్రస్థానం కొనసాగుతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నారాయణఖే మున్సిపాలిటీ కౌన్సిలర్ లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు