BREAKING
అంతర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ స్టార్.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి రహ్మత్ షా! సిలువగుట్ట అక్రమ తవ్వకాలపై సీపీఐ ఆగ్రహం.. టిప్పర్లు అడ్డగింత! ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా భారతరత్న జనబ్ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకలు పొన్నూరు మండలం సీతారాంపురం స్వర్ణ గ్రామంలో కేంద్ర, రాష్ట్ర అధికారుల పర్యటన పులమతి లో ఓపెన్ స్కూల్ సెంటర్ ప్రారంభం... ఐఎన్ఎస్ డేగాలో మంత్రి నారా లోకేష్‌కు స్వాగతం పలికిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఓటీటీలోకి మార్వెల్ సంచలనం 'అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఎన్‌కోర్'.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు! స్థానిక ఎన్నికల్లో ‘రెడ్ బుక్’ రాజ్యాంగం అమలు: సీపీఐ, సీపీఎం ధ్వజం మంచాడవలస పాఠశాల ఆకస్మిక తనిఖీ * డీఈవో బ్రహ్మాజీ * పోలింగ్ బూత్ ల నిర్వహణ కు ఖర్చు పెట్టిన నిధులు మంజూరు చేయాలి... పూడూరు–కిష్టాపూర్ డివిజన్‌లో మౌలిక వసతుల సమస్యలు పరిష్కరించాలి: మాజీ కౌన్సిలర్ ఉమా నాగరాజ్ కంపసముద్రంలో కంపు.. కంపు..! పారిశుద్ధ్యంతో అంతర్గత రహదారులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తలారి రంగయ్య. అలరిస్తున్న 'ఈఎన్ఈ రిపీట్' ఫస్ట్ సింగిల్ 'మిత్వా'.. స్నేహబంధాన్ని చాటే మెలోడీ సాంగ్ విడుదల!

రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

Select Suryaa Now
రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలి*  *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

 

కర్నూలు, నవంబర్ 11:- రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి  వ్యవసాయ అనుబంధ అధికారులను ఆదేశించారు..

బుధవారం కలెక్టరేట్ లో వివిధ వ్యవసాయ అంశాల పై వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష  నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం, వర్షాభావ పరిస్థితులు, పంట నష్టం, దిగుబడులు, రైతులకు అందించిన విత్తనాలు, ఎరువులు, పంట బీమా వివరాలను సమగ్రంగా, స్పష్టమైన గణాంకాలతో నివేదిక సిద్ధం చేయాలని కలెక్టర్ సంబంధిత వ్యవసాయ అధికారులను ఆదేశించారు.  ఖరీఫ్, రబీ సీజన్లలో ఎరువుల కేటాయింపు, జిల్లాకు వచ్చిన ఎరువులు, రైతులకు పంపిణీ చేసిన ఎరువులు, మిగిలిన నిల్వల వివరాలు కూడా సిద్ధం చేయాలన్నారు..  ఖరీఫ్‌లో వరి, శనగలు, కందులు  వంటి పంటలకు, రబీలో శనగ, టమాటా, ఉల్లి, మిరప వంటి పంటలకు సంబంధించిన బీమా వివరాలను స్పష్టంగా నమోదు చేయాలన్నారు..పీఎం కిసాన్ పథకానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న రైతుల వివరాలు, ఈ-కేవైసీ, ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు..

ఉద్యాన శాఖ కు సంబంధించి  మూడు, నాలుగు రకాల పంటలను సమీకృత పద్ధతిలో సాగు చేయడం, మెట్ట ప్రాంతాల్లో ఉద్యాన పంటలు, నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో కూరగాయల సాగును ప్రోత్సహించాలన్నారు. వర్షాధార ప్రాంతాల్లో పంటల సాగును మార్చి నెల నుంచే ప్రారంభించేలా ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. మార్చి, ఏప్రిల్, మే నెలలను దృష్టిలో ఉంచుకుని రైతులకు అవసరమైన విత్తనాలు, సీడ్ కిట్లు, ఇతర వ్యవసాయ సహాయాన్ని అందించేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. పశువులు, గొర్రెలు, మేకలకు అవసరమైన పశుగ్రాసాన్ని అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ, పశుసంవర్ధక శాఖలు సంయుక్తంగా కార్యాచరణ చేపట్టాలన్నారు.  కాలువలు, నదీ పరివాహక ప్రాంతాలు, ఉపరితల జలాలు అందుబాటులో ఉన్న ప్రాంతాలను గుర్తించి పశుగ్రాసం, ఇతర అనుకూల పంటల సాగుకు వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలన్నారు..

వ్యవసాయ టర్మ్ లోన్స్, అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎంఎస్ఎంఈ, విద్యా రుణాలు, గృహ రుణాల మంజూరులో పురోగతి పెంచాలని కలెక్టర్ ఎల్డీఎం ను ఆదేశించారు.. పశుసంవర్ధక రంగంలో రైతుల ఆదాయాన్ని పెంచేలా గొర్రెల పెంపకం, పాడి పరిశ్రమ తదితర అనుబంధ కార్యకలాపాలను ప్రోత్సహించాలన్నారు. పీఎంఎఫ్ఎంఈ పథకం కింద బ్యాంకు రుణాల మంజూరును వేగవంతం చేయాలన్నారు. రైతులకు ప్రయోజనం చేకూరేలా వ్యవసాయం, ఉద్యానవనం, బ్యాంకింగ్, పశుసంవర్ధక శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.. రైతుల సమష్టి ప్రయోజనాల కోసం రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOs), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) సభ్యత్వాలను పెంచాలన్నారు. రైతులకు ఉపయోగపడేలా కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్ర పరికరాలను సమష్టిగా వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 

సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, ఉద్యాన శాఖ అధికారి రాజాకృష్ణ రెడ్డి, పశుసంవర్ధక శాఖ అధికారి డా.రాజశేఖర్, సిపిఓ భారతి, ఎల్డిఎమ్ మోహన్, మార్కెటింగ్ ఏడి నారాయణ మూర్తి, న్యాచురల్ ఫార్మింగ్ అధికారి మాధురి, కో ఆపరేటివ్ అధికారి శిరీష, తదితరులు పాల్గొన్నారు