BREAKING
అంతర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ స్టార్.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి రహ్మత్ షా! సిలువగుట్ట అక్రమ తవ్వకాలపై సీపీఐ ఆగ్రహం.. టిప్పర్లు అడ్డగింత! ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా భారతరత్న జనబ్ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకలు పొన్నూరు మండలం సీతారాంపురం స్వర్ణ గ్రామంలో కేంద్ర, రాష్ట్ర అధికారుల పర్యటన పులమతి లో ఓపెన్ స్కూల్ సెంటర్ ప్రారంభం... ఐఎన్ఎస్ డేగాలో మంత్రి నారా లోకేష్‌కు స్వాగతం పలికిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఓటీటీలోకి మార్వెల్ సంచలనం 'అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఎన్‌కోర్'.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు! స్థానిక ఎన్నికల్లో ‘రెడ్ బుక్’ రాజ్యాంగం అమలు: సీపీఐ, సీపీఎం ధ్వజం మంచాడవలస పాఠశాల ఆకస్మిక తనిఖీ * డీఈవో బ్రహ్మాజీ * పోలింగ్ బూత్ ల నిర్వహణ కు ఖర్చు పెట్టిన నిధులు మంజూరు చేయాలి... పూడూరు–కిష్టాపూర్ డివిజన్‌లో మౌలిక వసతుల సమస్యలు పరిష్కరించాలి: మాజీ కౌన్సిలర్ ఉమా నాగరాజ్ కంపసముద్రంలో కంపు.. కంపు..! పారిశుద్ధ్యంతో అంతర్గత రహదారులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తలారి రంగయ్య. అలరిస్తున్న 'ఈఎన్ఈ రిపీట్' ఫస్ట్ సింగిల్ 'మిత్వా'.. స్నేహబంధాన్ని చాటే మెలోడీ సాంగ్ విడుదల!

రోడ్డు ప్రమాదాల నివారణకు గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద భద్రతా చర్యలు వేగవంతం చేయాలి* *పెండింగ్ రోడ్డు నిర్మాణాలు, విస్తరణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

Select Suryaa Now
రోడ్డు ప్రమాదాల నివారణకు గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద భద్రతా చర్యలు వేగవంతం చేయాలి*  *పెండింగ్ రోడ్డు నిర్మాణాలు, విస్తరణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి*  *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

 

కర్నూలు, నవంబర్ 11: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు గుర్తించిన బ్లాక్ స్పాట్ల వద్ద అవసరమైన భద్రతా చర్యలను తక్షణమే చేపట్టాలని, రహదారి నిర్మాణాలు, విస్తరణ పనులు, పెండింగ్ ఇంజనీరింగ్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. 

బుధవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధ్యక్షతన నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన 17 బ్లాక్ స్పాట్లలో తాత్కాలిక భద్రతా చర్యలు దాదాపు పూర్తయ్యాయని, దీర్ఘకాలిక చర్యల్లో భాగంగా వాహనాల అండర్‌పాస్‌లు, సర్వీస్ రోడ్లు, రహదారుల విస్తరణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.. పూర్తయిన స్పీడ్ బ్రేకర్ల వద్ద వైట్ పెయింటింగ్, రోడ్డు మార్కింగ్లు, రిఫ్లెక్టర్లు, హెచ్చరిక బోర్డుల ఏర్పాటును ఐదు రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. రాళ్లదొడ్డి నుంచి ఎమ్మిగనూరు వరకు చేపడుతున్న పైప్‌లైన్ పనులను త్వరగా పూర్తి చేసి, వెంటనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని కలెక్టర్ ఆర్ అండ్ బి ఎస్ఈ ని ఆదేశించారు.. జాతీయ రహదారులపై అక్రమ పార్కింగ్‌ను తొలగించేందుకు పోలీస్, రవాణా శాఖల అధికారులు సమన్వయంతో పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు.. గుర్తించిన అనధికార నిర్మాణాల తొలగింపునకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కర్నూలు నగర ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనకు సంబంధించి డీపీఆర్ తయారీ, అంచనాల రూపకల్పన సిద్ధం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో అవసరానికి అనుగుణంగా స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని, అనవసరమైన స్పీడ్ బ్రేకర్లను తొలగించాలన్నారు. ముఖ్యంగా బళ్లారి క్రాస్ రోడ్డు నుంచి పెద్దపాడు వరకు రహదారిపై ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని, అక్కడ జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని డివైడర్ల ఏర్పాటు, రహదారి మార్గాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రోడ్ల పై గుంతలను గుర్తించి వెంటనే మరమ్మతుల పనులను చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి పెండింగ్‌ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. 

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ సెప్టెంబర్ నెలలో నమోదైన రోడ్డు ప్రమాదాల వివరాలను పరిశీలించగా ఆర్‌అండ్‌బీ రహదారులతో పాటు ఎన్‌హెచ్‌-44, ఎన్‌హెచ్‌-40పై ఎక్కువ ప్రమాదాలు నమోదైనట్లు తెలిపారు. రహదారులపై తగినంత వెలుతురు లేకపోవడం, అతివేగం, తదితర ప్రమాద కారణాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు.. బ్లాక్ స్పాట్ల వద్ద చేపట్టిన భద్రతా చర్యలను పోలీస్, రవాణా, ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్‌ఏఐ శాఖల అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలన్నారు.. ప్రజలకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యాలు కల్పించేందుకు రోడ్డు భద్రతా చర్యలు, రహదారి అభివృద్ధి పనులను నిర్దేశిత కాలపరిమితిలో పూర్తి చేయాలన్నారు..

సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఎస్ఈ మహేశ్వర రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, డిటిసి శాంత కుమారి, నేషనల్ హైవే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సునీత, డిఎంహెచ్వో డా.కామేశ్వర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.