BREAKING
సిలువగుట్ట అక్రమ తవ్వకాలపై సీపీఐ ఆగ్రహం.. టిప్పర్లు అడ్డగింత! ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా భారతరత్న జనబ్ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకలు పొన్నూరు మండలం సీతారాంపురం స్వర్ణ గ్రామంలో కేంద్ర, రాష్ట్ర అధికారుల పర్యటన పులమతి లో ఓపెన్ స్కూల్ సెంటర్ ప్రారంభం... ఐఎన్ఎస్ డేగాలో మంత్రి నారా లోకేష్‌కు స్వాగతం పలికిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఓటీటీలోకి మార్వెల్ సంచలనం 'అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఎన్‌కోర్'.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు! స్థానిక ఎన్నికల్లో ‘రెడ్ బుక్’ రాజ్యాంగం అమలు: సీపీఐ, సీపీఎం ధ్వజం మంచాడవలస పాఠశాల ఆకస్మిక తనిఖీ * డీఈవో బ్రహ్మాజీ * పోలింగ్ బూత్ ల నిర్వహణ కు ఖర్చు పెట్టిన నిధులు మంజూరు చేయాలి... పూడూరు–కిష్టాపూర్ డివిజన్‌లో మౌలిక వసతుల సమస్యలు పరిష్కరించాలి: మాజీ కౌన్సిలర్ ఉమా నాగరాజ్ కంపసముద్రంలో కంపు.. కంపు..! పారిశుద్ధ్యంతో అంతర్గత రహదారులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తలారి రంగయ్య. అలరిస్తున్న 'ఈఎన్ఈ రిపీట్' ఫస్ట్ సింగిల్ 'మిత్వా'.. స్నేహబంధాన్ని చాటే మెలోడీ సాంగ్ విడుదల! మహా పాదయాత్రకు కదలిరండి - 18న కరీంనగర్‌లో బండి సంజయ్ ఆధ్వర్యంలో యాత్ర

విశాఖ వేదికగా రూ.11 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం!

Select Suryaa Now
విశాఖ వేదికగా రూ.11 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం!

 సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి :  ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలకు ఆతిథ్యమిచ్చేందుకు విశాఖ నగరం సర్వసన్నద్ధమైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 12, 13 తేదీల్లో జరగనున్న 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్–2026 రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కీలక వేదికగా నిలవనుందని పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొననున్నారని తెలిపారు.

ఈ సదస్సు ద్వారా సుమారు రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం ఆశిస్తోందని, దాదాపు 3,800 అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని పల్లా వెల్లడించారు. 58 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటుండటం విశాఖకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకొస్తుందని పేర్కొన్నారు.

 *ప్రపంచ దిగ్గజ కంపెనీల చూపు ఏపీ వైపు* 

కియా మోటార్స్, రెన్యూ, మాండెలెజ్ ఇండియా, సెయింట్ గోబెయిన్, నాల్కో, లెవిస్టా వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు సదస్సులో పాల్గొననున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగానికి చెందిన హాథర్ రాకెట్స్, అగ్నికుల్, బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్, స్కైరూట్ సంస్థల ప్రతినిధులు కూడా భాగస్వాములు కానున్నారు. ఆటోమొబైల్, పునరుత్పాదక ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాలు, తయారీ, సాంకేతిక రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై చర్చలు జరగనున్నాయని తెలిపారు.

 *గూగుల్ డేటా సెంటర్‌తో విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు* 

విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్‌తో పాటు మరిన్ని డేటా సెంటర్లు ఏర్పాటు కానుండటం ఐటీ రంగానికి కొత్త ఊపునిస్తుందని పల్లా పేర్కొన్నారు. గూగుల్ సంస్థ సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడైన నేపథ్యంలో, విశాఖ అంతర్జాతీయ డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా ఎదిగే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ పెట్టుబడులు ఇతర సాంకేతిక, సాఫ్ట్‌వేర్ సంస్థలను కూడా విశాఖ వైపు ఆకర్షించే అవకాశం ఉందన్నారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ తక్కువ విద్యుత్ వినియోగం, కనిష్ఠ నీటి వినియోగంతో గ్రీన్ డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం దృష్టి సారిస్తోందని వివరించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ కేంద్రాలు విశాఖలో బలమైన ఐటీ, డిజిటల్ ఎకోసిస్టమ్ నిర్మాణానికి దోహదపడతాయని పేర్కొన్నారు.

 *గొడ్డలి పార్టీ పాలనలో దెబ్బతిన్న బ్రాండ్.. కూటమి పాలనలో పెట్టుబడులపై దృష్టి* 

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర పారిశ్రామిక రంగం ఒడిదుడుకులు ఎదుర్కొందని, జగన్ రెడ్డి ప్రభుత్వ విధానాలపై పెట్టుబడిదారుల్లో అనిశ్చితి నెలకొందని పల్లా విమర్శించారు. గతంలో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పినప్పటికీ, వాటి అమలు, పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనపై స్పష్టత అవసరమని అన్నారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక రాయితీలు, సంస్థల అవసరాలకు అనుగుణంగా ప్రోత్సాహకాలు, వేగవంతమైన అనుమతుల విధానాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని తెలిపారు. వ్యాపార నిర్వహణలో వేగం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు రాష్ట్రానికి అనుకూలతలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రూ.26 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన, యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన చేపడుతున్న కార్యాచరణ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అవకాశాలను కూడా విస్తరించనుందని తెలిపారు.

 *ఉత్తరాంధ్ర అభివృద్ధికి విశాఖ సదస్సు దిక్సూచి* 

సీఐఐ సమ్మిట్ ద్వారా విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలకు పారిశ్రామిక అవకాశాలు విస్తరించే వీలుందని పల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త పరిశ్రమలు, అనుబంధ సంస్థలు, రవాణా, లాజిస్టిక్స్, సేవారంగాల విస్తరణతో ఉత్తరాంధ్ర యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందన్నారు. విశాఖను ఐటీ, తయారీ, అంతరిక్ష సాంకేతికత, డిజిటల్ రంగాలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని పేర్కొన్నారు.

గతంలో నిర్వహించిన ఐదు ప్రాంతీయ సదస్సుల ద్వారా రూ.86 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు పేర్కొన్న పల్లా, తాజా సీఐఐ సమ్మిట్ ద్వారా మరిన్ని పెట్టుబడి ప్రతిపాదనలు కార్యరూపం దాల్చాలని ఆకాంక్షించారు. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రలో పారిశ్రామిక కార్యకలాపాలు విస్తరించి, యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేలా ఈ సదస్సు ఫలితాలు ఉండాలని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.