వలస సుభాష్ చంద్రబోస్ ను పరామర్శించిన బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు ముదుగంటి విష్ణువర్ధన్ రెడ్డి
కోహెడ మండలంలోని కూరెల్ల గ్రామానికి చెందిన సంకల్ప స్వచంద సేవా సంస్థ అధ్యక్షులు బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ సంఘ సేవకులు వలస సుభాష్ చంద్రబోస్ తల్లి వలస కమలాదేవి గత ఏడు రోజులు క్రితం అనారోగ్యంతో మరణించగా నేడు కురేళ్లలోని వారి నివాసంలో బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ సంఘ సేవకులు ముదుగంటి విష్ణు వర్ధన్ రెడ్డి సుభాష్ చంద్ర బోస్ ను పరామర్శించి కమలాదేవి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని, వారి చిత్ర పటానికి పూలమాలలతో నివాళులర్పించారు. వారి వెంట బాలల హక్కుల ప్రజావేదిక సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు పచ్చిమట్ల శ్రీలత వడ్డెర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గొల్లెల బాలమని మండల కళాకారుల సంఘం నాయకులు వడ్డేపల్లి మహేందర్ జాలి ఆగయ్య తిరుపతి రమేష్ రామచంద్రం గౌడ్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.