BREAKING
ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా భారతరత్న జనబ్ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకలు పొన్నూరు మండలం సీతారాంపురం స్వర్ణ గ్రామంలో కేంద్ర, రాష్ట్ర అధికారుల పర్యటన పులమతి లో ఓపెన్ స్కూల్ సెంటర్ ప్రారంభం... ఐఎన్ఎస్ డేగాలో మంత్రి నారా లోకేష్‌కు స్వాగతం పలికిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఓటీటీలోకి మార్వెల్ సంచలనం 'అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఎన్‌కోర్'.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు! స్థానిక ఎన్నికల్లో ‘రెడ్ బుక్’ రాజ్యాంగం అమలు: సీపీఐ, సీపీఎం ధ్వజం మంచాడవలస పాఠశాల ఆకస్మిక తనిఖీ * డీఈవో బ్రహ్మాజీ * పోలింగ్ బూత్ ల నిర్వహణ కు ఖర్చు పెట్టిన నిధులు మంజూరు చేయాలి... పూడూరు–కిష్టాపూర్ డివిజన్‌లో మౌలిక వసతుల సమస్యలు పరిష్కరించాలి: మాజీ కౌన్సిలర్ ఉమా నాగరాజ్ కంపసముద్రంలో కంపు.. కంపు..! పారిశుద్ధ్యంతో అంతర్గత రహదారులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తలారి రంగయ్య. అలరిస్తున్న 'ఈఎన్ఈ రిపీట్' ఫస్ట్ సింగిల్ 'మిత్వా'.. స్నేహబంధాన్ని చాటే మెలోడీ సాంగ్ విడుదల! మహా పాదయాత్రకు కదలిరండి - 18న కరీంనగర్‌లో బండి సంజయ్ ఆధ్వర్యంలో యాత్ర పంటల బీమా నమోదు సద్వినియోగం చేసుకోవాలి - మండల వ్యవసాయ అధికారి కిషోర్ బాబు

*దేశిని చిన మల్లయ్య సేవలు చిరస్మరణీయం ఘనంగా 9వ, వర్ధంతి వేడుకలు*

Select Suryaa Now
*దేశిని చిన మల్లయ్య సేవలు చిరస్మరణీయం ఘనంగా 9వ, వర్ధంతి వేడుకలు*

ఇందూర్తి మాజీ శాసనసభ్యులు దేశిని చిన మల్లయ్య గౌడ్ 9వ, వర్ధంతి వేడుకలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, కంటస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గ్రామ సర్పంచ్ బందెల సుజాత - బాలకిషన్ హాజరై వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్బంగా సాయికృష్ణ హాస్పటల్ లోని రోగులకు పండ్లు, బ్రేడ్ పంపిణీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ...
దేశిని చిన మల్లయ్య గౌడ్ ఈ ప్రాంతానికే కాకుండా,యావత్ తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శమని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మల్లయ్య కీలక పాత్ర పోషించారని అన్నారు.నిరాడంబరంగా జీవనం సాగించి సిపిఐ పార్టీ కి చిన్న మల్లయ్య విశిష్ట సేవలు అందించారని రాజు అన్నారు. దేశిని చిన్న మల్లయ్య పేరు మీదుగా ప్రభుత్వం ఒక పథకం ప్రవేశ పెట్టీ  ఈ ప్రాంతానికి సేవలందించాలనీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కి రాజు విజ్ఞప్తి చేశారు. దేశిని చిన్న మల్లయ్య వారసుడిగా తన ఆశయాలను కొనసాగిస్తానని రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు ముంజ ప్రకాష్ గౌడ్, రమేష్ గౌడ్, తిరుపతి గౌడ్, డాక్టర్ శ్రీనివాస్ ఆటోయూనియన్ అధ్యక్షులు పి.చంద్రయ్య,ఏస్ రమేష్, శ్రీనివాస్ కాయిత రామ దాస్,మహిళా సంఘం నాయకులు మంజుల గౌడ్,మౌనిక,వాసాల సంపత్, మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు షేక్ గోరిమియా, లాల్ తదితరులు పాల్గొన్నారు.