BREAKING
ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా భారతరత్న జనబ్ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకలు పొన్నూరు మండలం సీతారాంపురం స్వర్ణ గ్రామంలో కేంద్ర, రాష్ట్ర అధికారుల పర్యటన పులమతి లో ఓపెన్ స్కూల్ సెంటర్ ప్రారంభం... ఐఎన్ఎస్ డేగాలో మంత్రి నారా లోకేష్‌కు స్వాగతం పలికిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఓటీటీలోకి మార్వెల్ సంచలనం 'అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఎన్‌కోర్'.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు! స్థానిక ఎన్నికల్లో ‘రెడ్ బుక్’ రాజ్యాంగం అమలు: సీపీఐ, సీపీఎం ధ్వజం మంచాడవలస పాఠశాల ఆకస్మిక తనిఖీ * డీఈవో బ్రహ్మాజీ * పోలింగ్ బూత్ ల నిర్వహణ కు ఖర్చు పెట్టిన నిధులు మంజూరు చేయాలి... పూడూరు–కిష్టాపూర్ డివిజన్‌లో మౌలిక వసతుల సమస్యలు పరిష్కరించాలి: మాజీ కౌన్సిలర్ ఉమా నాగరాజ్ కంపసముద్రంలో కంపు.. కంపు..! పారిశుద్ధ్యంతో అంతర్గత రహదారులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తలారి రంగయ్య. అలరిస్తున్న 'ఈఎన్ఈ రిపీట్' ఫస్ట్ సింగిల్ 'మిత్వా'.. స్నేహబంధాన్ని చాటే మెలోడీ సాంగ్ విడుదల! మహా పాదయాత్రకు కదలిరండి - 18న కరీంనగర్‌లో బండి సంజయ్ ఆధ్వర్యంలో యాత్ర పంటల బీమా నమోదు సద్వినియోగం చేసుకోవాలి - మండల వ్యవసాయ అధికారి కిషోర్ బాబు

ఇదులగూడ జంక్షన్‌లో 100 ఫీట్ల సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం

Select Suryaa Now
ఇదులగూడ జంక్షన్‌లో 100 ఫీట్ల సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం

 

మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్: మిర్యాలగూడ పట్టణంలోని ఇదులగూడ జంక్షన్ వద్ద 100 ఫీట్ల సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) బుధవారం శ్రీకారం చుట్టారు. కొబ్బరికాయ కొట్టి పనులను లాంఛనంగా ప్రారంభించారు. పట్టణ ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు తొలగించడంతో పాటు, ప్రధాన రహదారిపై ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే BLR మాట్లాడుతూ పట్టణంలో మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు, ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదులగూడ జంక్షన్ వద్ద 100 ఫీట్ల సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తయితే పట్టణం నుంచి ప్రధాన రహదారిపైకి వెళ్లే వాహనదారులకు, ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మున్సిపల్ చైర్‌పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్‌పర్సన్ గుడిపాటి శిరీష నవీన్, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.