BREAKING
అధికారులు సమన్వయంతో పని చేయాలి ఎమ్మెల్యే సంజీవరెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల మురళికి జనసేన ఎంపీటీసీ లాల్ స్వామి కృతజ్ఞతలు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల మురళికి జనసేన ఎంపీటీసీ లాల్ స్వామి కృతజ్ఞతలు సర్పంచ్ మరియు వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ కోసం ప్రతిపాదించిన కేంద్రాలు గ్రామాల పేర్లు, కోడ్లు, జనాభా వివరాలు భూ నిర్వాసితులను ఇంకెప్పుడు ఆడుకుంటారు?! సీఎం సభ ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్, సిపి బీజేపీ కార్మిక విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా శ్రీకాంత్ గౌడ్ ల్యాండ్‌ పూలింగ్‌తో ప్రాంత అభివృద్ధికి కొత్త రూపు:కీసర ఆర్డీవో నల్ల వెంకటరెడ్డి రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం – గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం... *సీసీ కెమెరాల నిఘానిడలో పోరేడ్డిపల్లి గ్రామం* చిన్నారి శారీ ఫంక్షన్‌లో పాల్గొని ఆశీర్వదించిన మాజీ జడ్పీటీసీ కొప్పుల నాగిరెడ్డి చిన్న మొత్తానికి ఆశపడి చిక్కుల్లో పడొద్దు ఖాతాదారులకు బ్యాంకు మేనేజర్ హెచ్చరిక చిన్న మొత్తానికి ఆశపడి చిక్కుల్లో పడొద్దు ఖాతాదారులకు బ్యాంకు మేనేజర్ హెచ్చరిక ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శాంత్ కుమార్ మార్కాపురం తొలి జెడ్పీ చైర్మన్‌కు ఘన సన్మానం

శ్రీకాళహస్తి ప్రాంతంలో గంజాయి స్వాధీనం వ్యక్తి అరెస్ట్

Select Suryaa Now
శ్రీకాళహస్తి ప్రాంతంలో గంజాయి స్వాధీనం వ్యక్తి అరెస్ట్

 

తిరుపతి : జిల్లా ఎస్పీ  ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్  ఆదేశాల మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి రైల్వే గేటు వద్ద శ్రీకాళహస్తి రూరల్ పోలీసుల దాడి చేసి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు.

- నిందితుడి వద్ద నుంచి 1,100 గ్రాముల గంజాయి, సెల్‌ఫోన్, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు.

- గంజాయి సరఫరా చేస్తున్న ఇతర వ్యక్తుల గుర్తింపునకు కొనసాగుతున్న దర్యాప్తు. శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి రైల్వే గేటు వద్ద గంజాయి అక్రమ విక్రయాలకు సంబంధించి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు శ్రీకాళహస్తి రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. ఇబ్రహీం తన సిబ్బంది, రెవెన్యూ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీలలో గంజాయి కలిగి ఉన్న ముచ్చువోలు గ్రామానికి చెందిన బర్రి మోహన్ రెడ్డి, తండ్రి మాధవరెడ్డిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు 1,100 గ్రాముల  గంజాయి, ఒక సెల్‌ఫోన్, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు.

ప్రాథమిక విచారణలో నిందితుడు ఒడిశా రాష్ట్రం ఛత్రపూర్ పట్టణానికి చెందిన శీను అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయిని తీసుకువచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్‌లో NDPS చట్టం సెక్షన్ 8(c) r/w 20(b)(ii)(B) ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గంజాయి సరఫరా చేస్తున్న ప్రధాన వ్యక్తితో పాటు ఈ అక్రమ కార్యకలాపాల్లో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి. వాటి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రజలకు ఎక్కడైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్ 112* కు తెలియజేయాలి. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని తిరుపతి జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.  *వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి*