విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు - సిపిఎం
బొబ్బిలి, సూర్య : తగరపువలస ముందున్న అవంతి ఇంజనీరింగ్ కాలేజీ మూడో సంవత్సరం బీటెక్ విద్యార్థులకు జెవిడి డబ్బులు ప్రభుత్వం వేయలేదని సంబంధించిన యాజమాన్యం విద్యార్థులను ఇబ్బందులు కు గురిచేస్తుంది. విద్యార్థులు 10,000 కడితే పరీక్షలు రాయినిస్తాం డబ్బులు కట్టకపోతే రాయినివ్వం అని అవంతి యాజమాన్యం విద్యార్థులకు చెప్పడంతో తీవ్రమైన మనోవేదనకు గురవుతున్న బీటెక్ విద్యార్థులు బొబ్బిలి ప్రాంతం నుండి బీటెక్ పేద విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులు మనస్థాపానికి గురై ఏ అగత్యానికి పాల్పడిన దానికి ప్రభుత్వం, యాజమాన్యమే బాధ్యత వహించవలసి ఉంటుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. శంకరరావు, నాయకులు సింగిరెడ్డి గోపాలు యామల మురళి అన్నారు. ఎంసెట్ ర్యాంకులు వచ్చే వారికి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందని విద్యార్థులు ఇంజనీరింగ్ చదువులకు ముందుకొస్తున్నారు. అటువంటి విద్యార్థులకు ప్రభుత్వం సకాలంలో కాలేజీలకి డబ్బులు చెల్లించి విద్యార్థుల మీద యాజమాన్యాలు ఒత్తిడి లేకుండా చేయాలి. పరీక్షలు సక్రమంగా రాయినవ్వకపోతే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. అలా చేయకుండా గాలికి వదిలేసి మీ చావు మీరు చావండి అని ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. పనికిమాలిన ఖర్చులు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు సకాలంలో చెల్లించకపోవడం సిగ్గుచేటని అన్నారు. తక్షణమే అవంతి యాజమాన్యంపై జిల్లా కలెక్టర్ యూనివర్సిటీ వి.సి. తగు చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. విద్యార్థులకు ఏ నష్టం జరిగినా దాని పరిణామం తీవ్రంగా ఉంటటుదని హెచ్చరించారు.