BREAKING
అధికారులు సమన్వయంతో పని చేయాలి ఎమ్మెల్యే సంజీవరెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల మురళికి జనసేన ఎంపీటీసీ లాల్ స్వామి కృతజ్ఞతలు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల మురళికి జనసేన ఎంపీటీసీ లాల్ స్వామి కృతజ్ఞతలు సర్పంచ్ మరియు వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ కోసం ప్రతిపాదించిన కేంద్రాలు గ్రామాల పేర్లు, కోడ్లు, జనాభా వివరాలు భూ నిర్వాసితులను ఇంకెప్పుడు ఆడుకుంటారు?! సీఎం సభ ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్, సిపి బీజేపీ కార్మిక విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా శ్రీకాంత్ గౌడ్ ల్యాండ్‌ పూలింగ్‌తో ప్రాంత అభివృద్ధికి కొత్త రూపు:కీసర ఆర్డీవో నల్ల వెంకటరెడ్డి రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం – గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం... *సీసీ కెమెరాల నిఘానిడలో పోరేడ్డిపల్లి గ్రామం* చిన్నారి శారీ ఫంక్షన్‌లో పాల్గొని ఆశీర్వదించిన మాజీ జడ్పీటీసీ కొప్పుల నాగిరెడ్డి చిన్న మొత్తానికి ఆశపడి చిక్కుల్లో పడొద్దు ఖాతాదారులకు బ్యాంకు మేనేజర్ హెచ్చరిక చిన్న మొత్తానికి ఆశపడి చిక్కుల్లో పడొద్దు ఖాతాదారులకు బ్యాంకు మేనేజర్ హెచ్చరిక ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శాంత్ కుమార్ మార్కాపురం తొలి జెడ్పీ చైర్మన్‌కు ఘన సన్మానం

పంట అవశేషాలతో జీవ ఇంధన ఉత్పత్తిపై రైతులకు అవగాహన!

Select Suryaa Now
పంట అవశేషాలతో జీవ ఇంధన ఉత్పత్తిపై రైతులకు అవగాహన!

 పంట అవశేషాలతో జీవ ఇంధన ఉత్పత్తిపై రైతులకు అవగాహన!

రిలయన్స్ బయోఎనర్జీ, లక్కీ ఆర్గానిక్ ఫామ్‌లను సందర్శించిన ఓర్వకల్లు మండల రైతులు

ఓర్వకల్లు మేజర్ న్యూస్:

పంట అవశేషాలను కాల్చకుండా వాటిని విలువైన వనరులుగా వినియోగించుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు లభిస్తాయని మండల వ్యవసాయ అధికారి మధుమతి పేర్కొన్నారు. వ్యవసాయ వ్యర్థాల సమర్థ వినియోగం, జీవ ఇంధన ఉత్పత్తి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు బుధవారం ఓర్వకల్లు మండలంలోని పూడిచెర్ల, కేతవరం, గుట్టపాడు, కొంతలపాడు, ఉప్పలపాడు గ్రామాలకు చెందిన రైతులకు ప్రత్యేక అవగాహన పర్యటన నిర్వహించారు.  రైతులుకల్లూరు మండలం లోని ఉలిందకొండ లోని రిలయన్స్ బయోఎనర్జీ లిమిటెడ్‌లోని కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్‌ను సందర్శించారు. అక్కడ ప్లాంట్ పనితీరు, బయోగ్యాస్ తయారీ విధానం, వ్యవసాయ వ్యర్థ పదార్థాలను ఇంధన ఉత్పత్తికి ఉపయోగించే ప్రక్రియను సంబంధిత సిబ్బంది వివరించారు. ముఖ్యంగా మొక్కజొన్న కంకి కాడలు, వరి గడ్డి వంటి పంట అవశేషాలను వినియోగించి జీవ ఇంధనాన్ని తయారు చేసే విధానాన్ని రైతులు ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం లక్కీ ఆర్గానిక్ ఫామ్‌ను సందర్శించి సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, పర్యావరణహిత సాగు విధానాలు, వ్యవసాయ వ్యర్థాల పునర్వినియోగంపై అవగాహన పొందారు. పంట కోతల అనంతరం పొలాల్లో మిగిలే అవశేషాలను కాల్చడం వల్ల నేల సారం తగ్గడంతో పాటు పర్యావరణానికి నష్టం కలుగుతుందని, వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా రైతులకు ఆర్థిక ప్రయోజనాలు కూడా చేకూరుతాయని ఈ పర్యటనలో వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయంలో అనుసరించడం, పంట వ్యర్థాలను ఆదాయ వనరులుగా మార్చుకోవడంపై రైతులు ఆసక్తి కనబరిచారు. ఈ కార్యక్రమంలో , రైతు సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే) ఇన్‌చార్జిలు జీషన్, హిమకిరణ్, ఏంజెల్‌తో పాటు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.