నీటి పన్ను వసూళ్లు వేగవంతం చేయాలి.....
విజయనగరం, సూర్య : నీటి పన్ను వసూళ్ళను వేగవంతం చేసి, లక్ష్యాలను అధిగమించాలని అడ్మిన్, ఎమినిటీస్ కార్యదర్శులకు కమిషనర్ బాలస్వామి ఆదేశించారు. గురువారం నుండి వారం రోజుల్లోగా నీటి పన్నులు చెల్లించాలని, లేకుంటే కుళాయి కనెక్షన్లను తొలగించి వేస్తామని నీటి వినియోగదారులకు ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఈరోజు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కమీషనర్ బాలస్వామి మాట్లాడుతూ నగర వ్యప్తంగా 28,330 కులాయి కనెక్షన్లు ఉన్నాయన్నారు. వాటి ద్వారా 7 కోట్ల 91 లక్షలు వసూలు లక్ష్యంగా ఉందన్నారు. అయితే ఇప్పటివరకు కేవలం 36 లక్షల మాత్రమే వసూలు అయిందన్నారు. అంటే నీటి పన్ను వసూలు 4.67 శాతం గా మాత్రమే నమోదయిందన్నారు. ఇంకా 7 కోట్ల 54 లక్షల రూపాయలు వసూలు చేయాల్సి ఉందన్నారు. పెద్ద మొత్తంలో నీటి పన్ను బకాయిలు ఉన్నాయని, అయితే నీటి సరఫరాకు ఎంతో వ్యయప్రయాసలు ఎదురవుతున్నాయని చెప్పారు.కావున నీటి పన్ను వసూళ్ళ పై ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసి పన్ను వసూలును ముమ్మరం చేస్తున్నామని చెప్పారు. ప్రతిరోజు సచివాలయాల వారిగా నీటి పన్ను వసూళ్ళ పై నివేదికలు పరిశీలిస్తామని తెలిపారు. నీటి పన్నుల వసూళ్ళలో అలసత్వం వహించిన, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది పై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఈఈ ప్రసాదు, డిఈలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.