telangana
రైతుల సంక్షేమమే ధ్యేయం - నగర మేయర్ దర్ని మధుకర్
సూర్య నస్పూర్ : రైతుల సంక్షేమం, వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ సీతారాంపల్లిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, దళారీ వ్యవస్థకు తావులేకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా నేరుగా ధాన్యం కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర అందిస్తామని తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను పొందాలని సూచించారు.రానున్న వేసవిలో ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పులు, నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశమున్నందున విలీన గ్రామాల రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు లాభదాయకమైన పంటలను ఎంచుకోవాలని సూచించారు.రానున్న వేసవిలో ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పులు, నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశమున్నందున విలీన గ్రామాల రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు లాభదాయకమైన పంటలను ఎంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సురిమిల్ల సౌమ్య, రాచకొండ గోపాల్‌రావు, మెప్మా పీడీ సుభాష్, ఐకేపీ కేంద్రం ఇన్‌చార్జి వర్ష, వ్యవసాయ శాఖ ఏఈ మహేందర్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు లింగయ్య, దర్ని మల్లేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.