కర్ణాటకలో నూతన దేవాలయం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే విరుపాక్షి
హొళగుంద , సూర్య ప్రతినిధి:
కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా,సాగర్ తాలూకాలో ఉన్న విరాపురం మఠం నూతన దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి బుధవారం హాజరయ్యారు. ఆయన సతీమణి బుసినే రామాంజినమ్మతో కలిసి హోమం, పూజల్లో పాల్గొన్నారు. వీరాపురం మఠం గురువులు నిర్మించిన నూతన దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి
కర్ణాటక మాజీ సీఎం యడయూరప్ప తనయుడు శివమొగ్గ పార్లమెంట్ సభ్యుడు రాఘవేంద్ర,కర్ణాటక మంత్రి లక్ష్మన్న,కర్ణాటక మంత్రి రుద్రప్ప,లంబాడి ఎమ్మెల్యే హెచ్ కె పాటిల్ ,వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు,బివిఆర్ అభిమానులు, హొళగుందకు చెందిన భక్తులు పాల్గొన్నారు.
టి.ఉమాపతి సూర్య ప్రతినిధి హొ ళ గుంద కర్నూలు జిల్లా