telangana
లింబాద్రి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి జాతరకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ఆహ్వానం
సూర్య వేల్పూర్ : ఈ నెలలో జరగనున్న లింబాద్రి గుట్ట (నింబాచల) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక జాతర ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ఆలయ ప్రధాన అర్చకులు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.వేల్పూర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనను కలిసి స్వామివారి వార్షిక జాతర సందర్భంగా నిర్వహించనున్న కళ్యాణోత్సవం, రథోత్సవ కార్యక్రమాలకు హాజరుకావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆహ్వానంపై సానుకూలంగా స్పందించి, స్వామివారి జాతర ఉత్సవాలకు హాజరవుతానని తెలిపారు.