51వ వార్డు నాయకులు, కార్యకర్తలుతో సమీక్ష సమావేశం నిర్వహించిన కె.కె రాజు
సీతమ్మధార, సూర్య : సీతంపేట ఏరియా లో 51వ వార్డు వైస్సార్సీపీ పార్టీ అభ్యర్థి సానబోయిన లలిత కుమారి సురేష్ అధ్యక్షతన 51వార్డు ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కె.కె రాజు ముఖ్య అతిథిగా పాల్గొని ఇటీవల జరిగిన జీవీఎంసీ ఎన్నికలపై నాయకులు, కార్యకర్తలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమేనని, సీనియర్ నాయకులు, కార్యకర్తలు కలిసి సమిష్టిగా పనిచేసి వార్డులో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 51వార్డు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.