telangana
గోపాల్ పేట మటన్ దుకాణాలను తనిఖీ చేసిన పశువైద్యాధికారి.
సూర్య, నాగిరెడ్డిపేట్ : వ్యాధి గ్రస్తమైన గొర్రెలు, మేకలను వధించి వాటి మాంసాన్ని వినియోదారులకు విక్రయిస్తున్నారని ఫిర్యాదు పై బుధవారం మండల కేంద్రంలోని గోపాల్ పేట గ్రామంలో మటన్ దుకాణాలను మండల పశువైద్యాధికారి రవికుమార్ తనిఖీ చేశారు.ఆరోగ్యకరమైన గొర్రెలు మరియు మేకలను మాత్రమే వధించాలని,వినియోదారులకు ఆరోగ్యకరమైన మాంసాన్ని విక్రయించాలని దుకాణదారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సలీం, పశు వైద్య శాఖ సిబ్బంది గౌస్, గంగారం ఉన్నారు.