దళారులను నమ్మి మోసపోవద్దు: ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి
సూర్య - మానకొండూర్ :రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. మానకొండూరు మండలంలోని ఊటూరు సొసైటీ ఆధ్వర్యంలో లక్ష్మీపూర్, దేవంపల్లి సొసైటీ ఆధ్వర్యంలో పచ్చునూరు, దేవంపల్లి గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తాలు లేకుండా పట్టించిన వడ్లను 40 కిలోల 600 గ్రాముల చొప్పున మాత్రమే తూకం వేస్తారని, అంతకన్నా ఒక్క గ్రాము కూడా ఎక్కువ తీసుకోరని స్పష్టం చేశారు. తరుగు పేరుతో ధాన్యాన్ని దోచుకునే పరిస్థితి లేదని, తరుగు తీసేందుకు, తాలు పట్టేందుకు అవసరమైన యంత్రాలను కూడా కేంద్రాలకు తీసుకువచ్చామని తెలిపారు. కాబట్టి రైతులు మంచిగా తాలు పట్టి నాణ్యమైన వడ్లను కేంద్రాలకు తీసుకురావాలని కోరారు.ప్రభుత్వం కనీస మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు అదనంగా రూ.500 బోనస్ ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని చెప్పారు. బయట వ్యాపారులు పచ్చి వడ్లనే కొంటామని, ఎక్కువ ధర ఇస్తామని చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. దళారుల బారి నుంచి రైతులను కాపాడేందుకే నాడు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కల్లాల వద్దే ఐకేపీ కేంద్రాలను ప్రారంభించారని గుర్తు చేశారు. ఆ చరిత్ర మళ్లీ పునరావృతం కాకుండా రైతులంతా విధిగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్ముకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రేవెల్లి రాజలింగం, వైస్ చైర్మన్ రేమిడి శ్రీనివాస్ రెడ్డి, ఊటూరు, దేవంపల్లి,మానకొండూర్ సొసైటీల అధ్యక్షులు ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి ఆర్. లక్ష్మారెడ్డి, నాగిశెట్టి రాజయ్య ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, సీఈఓ లు మేట్టపల్లి రవీందర్,కసిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి,నాయకులు రామిడి తిరుమల్ రెడ్డి, మర్రి ఓదెలు, బుర్ర శ్రీధర్ గౌడ్, వరహాల చారి, ఎడ్ల సత్యనారాయణ, కనకం అశోక్, రామినేని రమణ, జీడి శ్యామ్ ,నల్ల సూర్య ప్రకాష్, గుడాల మహేందర్, తదితరులు పాల్గొన్నారు...