BREAKING
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శాంత్ కుమార్ మార్కాపురం తొలి జెడ్పీ చైర్మన్‌కు ఘన సన్మానం *దేశిని చిన మల్లయ్య సేవలు చిరస్మరణీయం ఘనంగా 9వ, వర్ధంతి వేడుకలు* సేవకు గుర్తింపు .. పువ్వాడికి పట్టం! వచ్చే జూన్ వరకు జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి* *గాజులదిన్నె ప్రాజెక్ట్, సుంకేసుల ప్రాజెక్ట్ లలో ఉన్న నీటిని తాగునీటికి మాత్రమే వినియోగించాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* తాటిచర్లమోటులో ‘నారాయణమ్మ హోటల్’ ప్రారంభం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి రోడ్డు ప్రమాదాల నివారణకు గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద భద్రతా చర్యలు వేగవంతం చేయాలి* *పెండింగ్ రోడ్డు నిర్మాణాలు, విస్తరణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* విశాఖ వేదికగా రూ.11 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం! PMR హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్‌పై సమగ్ర విచారణ జరిపించాలి :ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు హేమా సుదర్శన్ జిల్లోజు డిమాండ్ సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన నగర మేయర్ రమేష్ గౌడ్ భూ రికార్డుల్లో తప్పులకు తావొద్దు జనవరి 31లోగా గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి చేయాలి అధిక ధరలకు నిత్యావసరాల విక్రయం.. 10 కేసులు నమోదు ఇదులగూడ జంక్షన్‌లో 100 ఫీట్ల సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం వలస సుభాష్ చంద్రబోస్ ను పరామర్శించిన బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు ముదుగంటి విష్ణువర్ధన్ రెడ్డి

మురుసు తుఫానుతో విద్యుత్ శాఖకు రూ.20 కోట్ల నష్టం

Select Suryaa Now
మురుసు తుఫానుతో విద్యుత్ శాఖకు రూ.20 కోట్ల నష్టం

15 వేల విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. గృహ విద్యుత్ సరఫరా 100 శాతం పునరుద్ధరణ

1,400 మంది సిబ్బందితో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు

సూర్య ప్రతినిధి, ఒంగోలు : 

మురుసు తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లిందని విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ కట్టా వేంకటేశ్వర్లు తెలిపారు. తుఫాను కారణంగా జిల్లావ్యాప్తంగా సుమారు 15 వేల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని, విద్యుత్ లైన్లు, ఇతర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం విద్యుత్ శాఖకు సుమారు రూ.20 కోట్ల మేర నష్టం సంభవించిందన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు శాఖ అధికారులు, సిబ్బంది గత వారం రోజులుగా రాత్రింబవళ్లు నిరంతరంగా శ్రమిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా గృహ విద్యుత్ వినియోగదారులకు సంబంధించిన సరఫరాను 100 శాతం పునరుద్ధరించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆక్వా, పారిశ్రామిక, వ్యవసాయ విద్యుత్ సర్వీసుల పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రులు, విద్యుత్ శాఖ మంత్రి, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రత్యేక చొరవ, ఆదేశాల మేరకు అదనపు విద్యుత్ సిబ్బంది బృందాలను రంగంలోకి దించినట్లు వివరించారు. కర్ణాటక రాష్ట్రం నుంచి 400 మంది, తమిళనాడు నుంచి 300 మంది, విజయవాడ, అనంతపురం, కర్నూలు తదితర ప్రాంతాల నుంచి స్థానిక విద్యుత్ సిబ్బంది బృందాలు పునరుద్ధరణ పనుల్లో పాల్గొన్నాయని తెలిపారు. మొత్తం సుమారు 1,400 మంది సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతమయ్యాయని పేర్కొన్నారు. డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) గత నాలుగు రోజులుగా నాగులుప్పలపాడులోనే ఉండి పునరుద్ధరణ పనులను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా ఏర్పడిన అసాధారణ పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకుని విద్యుత్ శాఖకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. పునరుద్ధరణ కార్యక్రమాల్లో పాల్గొన్న ఇతర రాష్ట్రాల విద్యుత్ సిబ్బంది, స్థానిక సిబ్బంది, అధికారులు, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మిగిలిన ఆక్వా, పారిశ్రామిక, వ్యవసాయ విద్యుత్ సర్వీసులను కూడా వీలైనంత త్వరగా పునరుద్ధరించి సాధారణ విద్యుత్ సరఫరా పరిస్థితులను పూర్తిస్థాయిలో తీసుకొస్తామని సూపరింటెండింగ్ ఇంజనీర్ కట్టా వేంకటేశ్వర్లు స్పష్టం చేశారు.