రాయిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం పేదోడి కల సహకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం
రాయికోడ్ , ; మండలంలోని రాయిపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం నాడు ఘనంగా ప్రారంభోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరు పేద కుటుంబాల చిరుకాల కోరిక సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని మండల ప్రజా ప్రతినిధులు నాయకులు తెలిపారు
ఈ యొక్క కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోల్ల అంజయ్య.మండల ప్రజా ప్రతినిధులు నాయకులు చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్లు ను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేదార్నాథ్ పాటిల్, ఉపాధ్యక్షుడు మహమ్మద్ రఫీక్ మియా, యూత్ అధ్యక్షుడు వి దర్శన్ రెడ్డి , మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వినయ్ కుమార్,రాయిపల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ పటేల్, సుల్తాన్ పటేల్, వివిధ గ్రామాల సర్పంచులు మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సొంతింటి కల నెరవేరడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు ప్రజా ప్రతినిధులకు శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు