BREAKING
రాణి మల్లమ్మ దేవి పార్కు ను పరిశీలించిన మున్సిపల్ ఎన్నికలు ప్రకృతి వ్యవసాయం రైతుల బాధ్యతగా మారాలి! ముంద్రా ప్లాంట్ పునరుద్ధరణ, సోలార్ వ్యాపారంతో భారీ లాభాలు వీళ్లే విజేతలు ... కందవాడకు ఉచిత అంబులెన్స్‌! శ్రీకాళహస్తి ప్రాంతంలో గంజాయి స్వాధీనం వ్యక్తి అరెస్ట్ వెలమలకి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇవ్వాలి..... * జిల్లా కొప్పుల వెలమ సంక్షేమ సంఘం డిమాండ్ * డేటా సెంటర్లుగా మూతపడిన అణు విద్యుత్ కేంద్రాలు... ఈఓఎన్ సమాలోచనలు పంట అవశేషాలతో జీవ ఇంధన ఉత్పత్తిపై రైతులకు అవగాహన! తెలుగుదేశం పార్టీకి గోవిందరావు చేసిన సేవలు చిరస్మరణీయం బలపడిన అమెరికా డాలర్... ఫెడ్ రేట్ల అంచనాలతో పడిపోయిన బ్రిటిష్ పౌండ్ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు - సిపిఎం వోక్స్ వాగన్ ప్రధాన ప్లాంట్‌లో 'గేమ్‌ఛేంజర్' మోడల్ ఉత్పత్తి నిలిపివేత ముడిచమురు ధరల పెరుగుదల: బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ $92 విశాఖపట్నం వైద్యుల అరుదైన ఘనత: హైదరాబాద్ మహిళకు సంక్లిష్టమైన వెన్నుపాము కణితి తొలగింపు

నెల్లిమర్లలో వామపక్షాల నిరసన * ఎస్ఈసీ రాజీనామాకు డిమాండ్ *

Select Suryaa Now
నెల్లిమర్లలో వామపక్షాల నిరసన     * ఎస్ఈసీ రాజీనామాకు డిమాండ్  *

విజయనగరం, సూర్య : ​సిపిఐ, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో నెల్లిమర్ల మొయిద జంక్షన్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణ దినం సందర్భంగా బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ న తక్షణమే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఓట్లను రద్దు చేస్తుంటే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాలను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం దుర్మార్గమని సిపిఐ మండల కార్యదర్శి మొయిద పాపారావు విమర్శించారు. ​రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అధికార పార్టీకి రిమోట్ కంట్రోల్‌లా మారి ఎన్నికలను అపహాస్యం చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించలేని ఎస్ఈసీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇది కేవలం మూడు పార్టీల కూటమి మాత్రమే కాదని, ఇందులో ఎన్నికల కమిషన్, పోలీసు వ్యవస్థలు కూడా భాగస్వాములయ్యాయని విమర్శించారు. ​ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కిలంపల్లి రామారావు, బ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.