BREAKING
రాణి మల్లమ్మ దేవి పార్కు ను పరిశీలించిన మున్సిపల్ ఎన్నికలు ప్రకృతి వ్యవసాయం రైతుల బాధ్యతగా మారాలి! ముంద్రా ప్లాంట్ పునరుద్ధరణ, సోలార్ వ్యాపారంతో భారీ లాభాలు వీళ్లే విజేతలు ... కందవాడకు ఉచిత అంబులెన్స్‌! శ్రీకాళహస్తి ప్రాంతంలో గంజాయి స్వాధీనం వ్యక్తి అరెస్ట్ వెలమలకి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇవ్వాలి..... * జిల్లా కొప్పుల వెలమ సంక్షేమ సంఘం డిమాండ్ * డేటా సెంటర్లుగా మూతపడిన అణు విద్యుత్ కేంద్రాలు... ఈఓఎన్ సమాలోచనలు పంట అవశేషాలతో జీవ ఇంధన ఉత్పత్తిపై రైతులకు అవగాహన! తెలుగుదేశం పార్టీకి గోవిందరావు చేసిన సేవలు చిరస్మరణీయం బలపడిన అమెరికా డాలర్... ఫెడ్ రేట్ల అంచనాలతో పడిపోయిన బ్రిటిష్ పౌండ్ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు - సిపిఎం వోక్స్ వాగన్ ప్రధాన ప్లాంట్‌లో 'గేమ్‌ఛేంజర్' మోడల్ ఉత్పత్తి నిలిపివేత ముడిచమురు ధరల పెరుగుదల: బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ $92 విశాఖపట్నం వైద్యుల అరుదైన ఘనత: హైదరాబాద్ మహిళకు సంక్లిష్టమైన వెన్నుపాము కణితి తొలగింపు

చిరుత సంచారం పై అప్రమత్తంగా ఉండండి. అడవి శాఖ అధికారి మల్లికార్జున.

Select Suryaa Now
చిరుత సంచారం పై అప్రమత్తంగా ఉండండి. అడవి శాఖ అధికారి మల్లికార్జున.

కుందుర్పి: మండలంలోని బసాపురం, కొత్తూరు గ్రామాల పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు సమాచారం ఉండటంతో గ్రామస్థులు, రైతులు, గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారి మల్లికార్జున సూచించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయా గ్రామాల పరిసర ప్రాంతాల్లో గొర్రెల కాపరులకు చిరుత సంచారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ అధికారి మాట్లాడుతూ.. పశువులను, గొర్రెలను మేతకు తీసుకెళ్లే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాలు, పొదలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలు, జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లకూడదని తెలిపారు. గొర్రెల మందలను మేపేందుకు తీసుకెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని, సాయంత్రం వేళల్లో చీకటి పడకముందే పశువులతో గ్రామాలకు చేరుకోవాలని సూచించారు. రాత్రి సమయాల్లో పశువులను బహిరంగ ప్రదేశాల్లో కాకుండా సురక్షితమైన ప్రదేశాల్లో ఉంచుకోవాలని, గొర్రెల కొట్టాలకు తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలని వివరించారు. చిరుతపులి కనిపించినప్పుడు దాని దగ్గరకు వెళ్లడం, వెంబడించడం, కేకలు వేస్తూ రెచ్చగొట్టడం వంటి చర్యలకు పాల్పడకూడదని హెచ్చరించారు. చిరుత సంచారాన్ని గమనించిన వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. అలాగే గ్రామస్థులు అపోహలకు గురికాకుండా, వదంతులను ప్రచారం చేయకుండా అధికారుల సూచనలను పాటించాలని తెలిపారు. పశువులపై చిరుత దాడి జరిగినా, పాదముద్రలు లేదా ఇతర ఆనవాళ్లు కనిపించినా వెంటనే అటవీశాఖకు తెలియజేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణుల సంరక్షణ కూడా ముఖ్యమని, చిరుతను పట్టుకునే ప్రయత్నాలు లేదా హాని కలిగించే చర్యలు చేపట్టకుండా అటవీశాఖకు సహకరించాలని మల్లికార్జున కోరారు. చిరుత సంచారంపై గ్రామస్థులు అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు. దీంతో బసాపురం, కొత్తూరు గ్రామాల గొర్రెల కాపరులు, రైతుల్లో అటవీశాఖ అధికారులు కల్పించిన అవగాహన కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.