సమాజం పట్ల బాధ్యతతో డ్రగ్స్ కి దూరంగా ఉంటూ తల్లిదండ్రుల కలను నెరవేర్చాలి
తూప్రాన్ ; మాదక ద్రవ్య రహిత దేశమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాకు చెందిన ఇందుకూరి విజయలక్ష్మి భీమవరం నుండి ఢిల్లీ వరకు చేపట్టిన సైకిల్ యాత్ర తూప్రాన్ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా గీతా కళాశాల యాజమాన్యం, విద్యార్థులు మరియు అధ్యాపకులు ఆమెకు ఘనస్వాగతం పలికారు.అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. వ్యసనాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలని సూచించారు. మున్సిపల్ చైర్ పర్సన్ రజిని రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ సమాజం పట్ల బాధ్యతతో డ్రగ్స్ కి దూరంగా ఉంటూ తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని కోరారు.
పట్టణ ఎస్సై గంగరాజు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ శారీరక ఆరోగ్యాన్ని కలిగి ఉండి ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించాలన్నారు.
కళాశాల కరెస్పాండెంట్ రామాంజనేయులు మాట్లాడుతూ విద్యార్థులు మత్తును తరిమేసి ఉజ్వల భవిష్యత్తును వెలిగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కళాశాల చైర్ పర్సన్ పి. ఉష, ప్రిన్సిపాల్ రాజు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రావు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.