విద్య ద్వారానే అభివృద్ధి * ప్రధానోపాధ్యాయులు డాక్టర్ జె సి రాజ్ *
రామభద్రపురం, సూర్య : సమాజాభివృద్ధిలో మార్పును తీసుకొచ్చే ఏకైక సాధనం విద్యేనని నాయుడు వలస పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ జె సి రాజు విద్యార్థులకు సూచించారు. బుధవారం పాఠశాలలో స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి భారతరత్న డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 136 వ జయంతి నేపధ్యంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని విద్యార్థులు నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఆనంతరం హెచ్ ఎం డాక్టర్ జె సి రాజు మాట్లాడుతూ ఆధునిక విద్యా వ్యవస్థకు బీజం వేసిన మౌలానా ఆజాద్ చిరస్మరణీయుడని అన్నారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ ను,ఐ ఐ టి ఘరక్ పూర్ లను స్తాపించారన్నారు. గాంధీ అనుచరునిగా, స్వాతంత్ర సమర యోధునిగా, విద్య శాఖ మంత్రిగా దేశానికి అందించిన సేవలు వెలకట్టలేనివని అన్నారు. ఆయన జయంతిని జాతీయ విద్యా దినోత్సవం ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. విద్యార్థులు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని కస్టపడి చదువుకోవాలన్నారు. విద్య తల రాతనుమారుస్తుందని, తరతరాల పేదరికాన్ని రూపొందుతుందని, సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడుతుందని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజమ్మ,కృష్ణం నాయుడు, రమణ, ఉదయకుమారి భవిత కేంద్రం ఐ ఇ రిసోర్స్ పర్సన్స్ తేజేశ్వరి, యసిస్వని విద్యార్థులు పాల్గొన్నారు.