BREAKING
సముద్రాలలో వడ్ల కొనుగోలు సెంటర్ ప్రారంభించిన గ్రామ సర్పంచ్ అట్ల శ్రీనివాస్ రాణి మల్లమ్మ దేవి పార్కు ను పరిశీలించిన మున్సిపల్ ఎన్నికలు ప్రకృతి వ్యవసాయం రైతుల బాధ్యతగా మారాలి! ముంద్రా ప్లాంట్ పునరుద్ధరణ, సోలార్ వ్యాపారంతో భారీ లాభాలు వీళ్లే విజేతలు ... కందవాడకు ఉచిత అంబులెన్స్‌! శ్రీకాళహస్తి ప్రాంతంలో గంజాయి స్వాధీనం వ్యక్తి అరెస్ట్ వెలమలకి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇవ్వాలి..... * జిల్లా కొప్పుల వెలమ సంక్షేమ సంఘం డిమాండ్ * డేటా సెంటర్లుగా మూతపడిన అణు విద్యుత్ కేంద్రాలు... ఈఓఎన్ సమాలోచనలు పంట అవశేషాలతో జీవ ఇంధన ఉత్పత్తిపై రైతులకు అవగాహన! తెలుగుదేశం పార్టీకి గోవిందరావు చేసిన సేవలు చిరస్మరణీయం బలపడిన అమెరికా డాలర్... ఫెడ్ రేట్ల అంచనాలతో పడిపోయిన బ్రిటిష్ పౌండ్ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు - సిపిఎం వోక్స్ వాగన్ ప్రధాన ప్లాంట్‌లో 'గేమ్‌ఛేంజర్' మోడల్ ఉత్పత్తి నిలిపివేత ముడిచమురు ధరల పెరుగుదల: బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ $92

బాసర ఐఐఐటీ విద్యార్థులకు నిరంతరం సురక్షిత తాగునీరు అందించాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

Select Suryaa Now
బాసర ఐఐఐటీ విద్యార్థులకు నిరంతరం సురక్షిత తాగునీరు అందించాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి : బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు నిరంతరం పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.బుధవారం బాసర ఐఐఐటీ (ఆర్జీయూకేటీ)లో విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి, క్యాంపస్‌లో నీటి సరఫరా సమస్యలు, ఇతర ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తాగునీటి నాణ్యతను పరీక్షించి, శుద్ధి చేసిన నీటిని మాత్రమే విద్యార్థులకు అందించాలని సూచించారు. నీరు ఎక్కడ కలుషితమవుతుందో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని, తాగునీటితో పాటు రోజువారీ అవసరాలకు సరిపడా నీటిని నిరంతరం సరఫరా చేయాలని ఆదేశించారు. విద్యార్థులు తమ సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఐఐఐటీ ఉపకులపతి గోవర్ధన్, ఓఎస్డీ మురళి దర్శన్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.