యాదవుల వీరత్వానికి ప్రతీక సదర్ సమ్మేళనం
రామచంద్రాపురం ; యాదవుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మగౌరవం, వీరత్వానికి సదర్ సమ్మేళనం ప్రతీకగా నిలుస్తుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. రామచంద్రాపురంలో మంగళవారం రాత్రి వైభవంగా నిర్వహించిన సదర్ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీపావళి అనంతరం నిర్వహించే ఈ వేడుకల్లో యాదవ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా జరిపారు.ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన దున్నపోతుల విన్యాసాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. డప్పు చప్పుళ్లు, సంప్రదాయ నృత్యాలు, యువత కేరింతల మధ్య వేడుకలు ఉల్లాసంగా సాగాయి. దున్నపోతుల బలం, విన్యాసాలను తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సదర్ సమ్మేళనం కేవలం పండుగ మాత్రమే కాదని, యాదవుల పశుపోషణ వారసత్వం, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించే గొప్ప వేదిక అని పేర్కొన్నారు. ఇలాంటి వేడుకలు సామాజిక ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించడంతో పాటు యాదవుల ఆత్మగౌరవాన్ని చాటిచెబుతాయని తెలిపారు.కార్యక్రమంలో మాజీ ప్రోటెం స్పీకర్ భూపాల్ రెడ్డి, బీ ఆర్ ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదర్శ్ రెడ్డి, సర్కిల్ అధ్యక్షుడు పరమేష్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నాగేష్, తొంట అంజయ్య, రాగం నాగేందర్ యాదవ్, ఐలేష్ యాదవ్, సంఘం నాయకుడు రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు
.