BREAKING
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు -రాష్ట్రంలోనే నెంబర్-1 గా నిర్వహించాలి: చైర్మన్ డా.రెడ్డివారి గురువారెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించిన కౌన్సిలర్ రాము దోమతెరలతో వ్యాధులు దూరం - డాక్టర్ బేతం హర్ష జాతీయ స్థాయి పోటీలకు ఎస్పీడబ్ల్యూ విద్యార్థిని ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన సంచలన పేసర్‌కు పిలుపు.. భారత్‌తో ఆఖరి రెండు వన్డేలకు కివీస్ జట్టు ప్రకటన! ఐపీఎల్‌లో 12 జట్లు, రూ.150 కోట్ల పర్స్‌.. విస్తరణ వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సంచలన క్లారిటీ! ఘనంగా ముగిసిన జాతీయ వర్క్ షాప్ మాంస ఉత్పత్తులతో స్టార్టప్ లకు మార్గం: డా. బి.శోభామణి కెప్టెన్‌గా అరంగేట్రంలో సెంచరీ.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టేందుకు శ్రేయస్ అయ్యర్ సిద్ధం! గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి అచ్చొచ్చిన మైదానంలో రోహిత్ శర్మ రికార్డులు.. నాలుగో వన్డేలో అదరగొట్టేందుకు సిద్ధం! ఐక్యూఏసీ డైరెక్టర్ గా ప్రొఫెసర్ రమేష్ బాబు ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్.. శ్రీలంక జట్టు ప్రకటన, కెప్టెన్‌గా పవన్ రత్నాయకే! ఉపాధ్యాయ వృత్తికే-కళంకం అండర్-19 ఆసియా కప్ సెమీస్‌లో చెలరేగిన సెహ్వాగ్‌ తనయుడు.. అర్ధశతకంతో అదరగొట్టిన ఆర్యవిర్! ‎ఆరోగ్యాలనిచ్చే ' తాయిలం' సంపదలను పెంచే ఆకు- తమలపాకు జనాలకు శుభాలనిచ్చే తమలపాకు.

వివాహ వేడుకలు, గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Select Suryaa Now
వివాహ వేడుకలు, గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం పలు వివాహ వేడుకలు, గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని నూతన వధూవరులను, గృహ యజమానులను ఆశీర్వదించారు. హైదరాబాద్‌తో పాటు వికారాబాద్ పట్టణ పరిసర ప్రాంతాల్లో జరిగిన వివిధ శుభకార్యాలకు హాజరై కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు.హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ అజీజ్‌నగర్‌లో ఉన్న పీవీ కన్వెన్షన్స్‌లో కోట్‌పల్లి మండలం కంకణాలపల్లి గ్రామానికి చెందిన తలారి నర్సింహులు-యాదమ్మ దంపతుల కుమార్తె సాయి దివ్య, శివ సాయి మణికంఠల వివాహ వేడుకకు స్పీకర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో అన్యోన్యంగా జీవించాలని ఆకాంక్షించారు.అదేవిధంగా వికారాబాద్ పట్టణంలోని రామయ్యగూడ కొండా బాలకృష్ణారెడ్డి గార్డెన్స్ ఫేజ్-1లో పూడూరు మండలం రాకంచర్ల గ్రామానికి చెందిన మారెపల్లి నర్సింహులు-విజయలక్ష్మి దంపతుల కుమారుడు ప్రమోద్ కుమార్, అరుణల వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.

వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి రోడ్డులో ఉన్న బసంత్ ఫంక్షన్ హాల్‌లో మైలార్ దేవరంపల్లి గ్రామానికి చెందిన కొమ్మని మొగులయ్య-లక్ష్మి దంపతుల కుమారుడు రాజు, సుచరితల వివాహ వేడుకలోనూ స్పీకర్ పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం వికారాబాద్ పట్టణ సమీపంలోని వెంకటాపూర్ తండాలో నేనావత్ రాజేష్ నాయక్-రుక్మిణిబాయి దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా దంపతులను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. నూతన గృహంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో కుటుంబం వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమాల్లో వధూవరుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయా వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు, కుటుంబ సభ్యులతో స్పీకర్ కొద్దిసేపు ముచ్చటించి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు.