59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గోడపత్రిక విడుదల
తె ర్లాం, సూర్య : ఈనెల 14వ తేదీ నుంచి 20 వ తేదీ వరకు 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించినట్టు గ్రంథాల అధికారి సిహెచ్ కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం స్థానిక ఎంఆర్సి భవనంలో మండల విద్యాశాఖ అధికారి జే త్రినాధ రావు ఆర్ పాపారావుల చేతుల మీదుగా గోడ పత్రిక విడుదల చేశారు. ఈ సందర్భంగా 14వ తేదీన గ్రంథాలయ వారోత్సవ ప్రారంభ వేడుకలు, బాలల దినోత్సవ వేడుకలు 15వ తేదీన పుస్తక ప్రదర్శన ఏర్పాటు, 16వ తేదీన గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులను స్మరించుట, 17వ తేదీన కవి సమ్మేళనాలు సెమినార్ రచయితలు సందేశాలు, 18వ తేదీన పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు చిత్రలేఖనం క్విజ్ పోటీలు నిర్వహణ, 19వ తేదీన మహిళా దినోత్సవ సందర్భంగా వివిధ రకాల పోటీలు 20 వ తేదీన అక్షరాస్యత దినోత్సవం వేడుకలు ముగింపు వేడుకలు ఉంటాయని ఆయన వివరించారు.