చిన్నారి చిరంజీవికి ఎర్రబెల్లి ఆశీస్సులు
దేవరుప్పుల , మేజర్ న్యూస్, చిన్నారుల చిరునవ్వులు ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని నింపుతాయని, వారి భవిష్యత్తు సంతోషంగా, ఆరోగ్యంగా సాగాలని ఆకాంక్షిస్తూ మాజీ మంత్రి, పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు చిన్నారి చిరంజీవిని ఆశీర్వదించారు. దేవరుప్పుల మండలంలోని చిన్నమడూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు జనగాం సంతోష్ తనయుడు చిరంజీవి మొదటి పుట్టినరోజు వేడుకకు నిర్వహించారు. ఈ వేడుకలో ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై చిన్నారిని ఆప్యాయంగా ఆశీర్వదించారు. చిరంజీవి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, తల్లిదండ్రులకు ఆనందాన్ని పంచుతూ ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. వేడుకలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పల్లా సుందర్ రాంరెడ్డి, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి చింత రవి, గ్రామ సర్పంచ్ మైదం జోగేశ్వర్, ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు, యువజన నాయకులు వంగ అర్జున్ భాషిపాక యాదగిరి ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు యువజన నాయకులు సోషల్ మీడియా కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: ఎల్లేష్ ,దేవరుప్పుల, జనగామ జిల్లా