BREAKING
రాణి మల్లమ్మ దేవి పార్కు ను పరిశీలించిన మున్సిపల్ ఎన్నికలు ప్రకృతి వ్యవసాయం రైతుల బాధ్యతగా మారాలి! ముంద్రా ప్లాంట్ పునరుద్ధరణ, సోలార్ వ్యాపారంతో భారీ లాభాలు వీళ్లే విజేతలు ... కందవాడకు ఉచిత అంబులెన్స్‌! శ్రీకాళహస్తి ప్రాంతంలో గంజాయి స్వాధీనం వ్యక్తి అరెస్ట్ వెలమలకి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇవ్వాలి..... * జిల్లా కొప్పుల వెలమ సంక్షేమ సంఘం డిమాండ్ * డేటా సెంటర్లుగా మూతపడిన అణు విద్యుత్ కేంద్రాలు... ఈఓఎన్ సమాలోచనలు పంట అవశేషాలతో జీవ ఇంధన ఉత్పత్తిపై రైతులకు అవగాహన! తెలుగుదేశం పార్టీకి గోవిందరావు చేసిన సేవలు చిరస్మరణీయం బలపడిన అమెరికా డాలర్... ఫెడ్ రేట్ల అంచనాలతో పడిపోయిన బ్రిటిష్ పౌండ్ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు - సిపిఎం వోక్స్ వాగన్ ప్రధాన ప్లాంట్‌లో 'గేమ్‌ఛేంజర్' మోడల్ ఉత్పత్తి నిలిపివేత ముడిచమురు ధరల పెరుగుదల: బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ $92 విశాఖపట్నం వైద్యుల అరుదైన ఘనత: హైదరాబాద్ మహిళకు సంక్లిష్టమైన వెన్నుపాము కణితి తొలగింపు

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఒపీ జిందాల్ భారతి స్కూల్ విద్యార్థులు

Select Suryaa Now
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఒపీ జిందాల్ భారతి స్కూల్ విద్యార్థులు

కొత్త వలస, సూర్య : అప్పన్నపాలెం గ్రామ కేంద్రంగా నిర్వహిస్తున్న ఒపీ జిందాల్ భారతి స్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ విశ్వనాథం తెలిపారు. అండర్-14 విభాగంలో హ్యాండ్‌బాల్‌కు డి. చతుర్య, డి. జాహ్నవి, కరాటేకు ఈ. దేవకీలత, సి.హెచ్. తన్విక, ఎస్. కార్తీక్, క్రికెట్‌కు కె. మోక్షజ్ఞ, బాస్కెట్‌బాల్‌కు కె. చాతుర్య, ఎల్. కుసుమ ఎంపికయ్యారని తెలిపారు.

అదేవిధంగా అండర్-17 విభాగంలో ఫుట్‌బాల్‌కు గొంప ప్రాణవసిద్ధార్థ్, జి. పార్థు, అండర్-14 బాస్కెట్‌బాల్ విభాగంలో జి. పూర్ణ సాయితేజ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు వెల్లడించారు. ఎంపికైన విద్యార్థులంతా రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు క్రీడల్లో తగిన శిక్షణ అందించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యేలా కృషి చేసిన పీడీ అప్పలనాయుడును ప్రిన్సిపాల్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల కార్యదర్శి దినేష్ శర్మ, ఉప కార్యదర్శి గోపాలకృష్ణ విద్యార్థులను అభినందించి, రాష్ట్రస్థాయి పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.