BREAKING
భారత పీఎల్ఐ (PLI) పథకాల రిపోర్ట్ కార్డ్: అంచనాలను అందుకున్న రంగాలు, వెనుకబడిన రంగాల పూర్తి వివరాలు 48వ డివిజన్‌లో విద్యుత్ అంతరాయం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇచ్చిన ఆ సలహానే నాకు శ్రీరామరక్ష.. యంగ్ పేసర్ ఆకిబ్ నబీ కీలక వ్యాఖ్యలు! 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు -రాష్ట్రంలోనే నెంబర్-1 గా నిర్వహించాలి: చైర్మన్ డా.రెడ్డివారి గురువారెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించిన కౌన్సిలర్ రాము దోమతెరలతో వ్యాధులు దూరం - డాక్టర్ బేతం హర్ష జాతీయ స్థాయి పోటీలకు ఎస్పీడబ్ల్యూ విద్యార్థిని ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన సంచలన పేసర్‌కు పిలుపు.. భారత్‌తో ఆఖరి రెండు వన్డేలకు కివీస్ జట్టు ప్రకటన! ఐపీఎల్‌లో 12 జట్లు, రూ.150 కోట్ల పర్స్‌.. విస్తరణ వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సంచలన క్లారిటీ! ఘనంగా ముగిసిన జాతీయ వర్క్ షాప్ మాంస ఉత్పత్తులతో స్టార్టప్ లకు మార్గం: డా. బి.శోభామణి కెప్టెన్‌గా అరంగేట్రంలో సెంచరీ.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టేందుకు శ్రేయస్ అయ్యర్ సిద్ధం! గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి అచ్చొచ్చిన మైదానంలో రోహిత్ శర్మ రికార్డులు.. నాలుగో వన్డేలో అదరగొట్టేందుకు సిద్ధం! ఐక్యూఏసీ డైరెక్టర్ గా ప్రొఫెసర్ రమేష్ బాబు ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్.. శ్రీలంక జట్టు ప్రకటన, కెప్టెన్‌గా పవన్ రత్నాయకే!

ఇసుకపల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు మాలధారణ స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన టీడీపీ కోఆర్డినేటర్ అనగాని శివప్రసాద్

Select Suryaa Now
ఇసుకపల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు  మాలధారణ స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన టీడీపీ కోఆర్డినేటర్ అనగాని శివప్రసాద్

రేపల్లె మేజర్ న్యూస్;
పట్టణ పరిధిలోని ఇసుకపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్, అనగాని శివప్రసాద్ ఆలయాన్ని సందర్శించి అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం ఆలయంలో మాలధారణ చేసిన అయ్యప్ప భక్తుల కోసం ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
నవంబర్ 11, 2026 నుంచి డిసెంబర్ 22, 2026 వరకు అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములకు ప్రతిరోజూ మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాలధారణ చేసిన స్వాములకు భోజనాన్ని వడ్డించి, వారి ఆధ్యాత్మిక దీక్షకు తన వంతు సహకారం అందించారు. అయ్యప్ప మాలధారణ అనేది భక్తి, నియమ నిష్ఠలు, క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతనతో కూడిన పవిత్ర దీక్ష అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి అయ్యప్ప స్వాములు దీక్ష చేపడుతున్న నేపథ్యంలో వారికి భోజన సదుపాయం కల్పించడం అభినందనీయమని భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం భక్తుల మధ్య ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పగా, ఆలయ ప్రాంగణం అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు స్వామివారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని ప్రార్థించారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, అయ్యప్ప స్వాములు, భక్తులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.