ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కలిసిన ఏపీ జెఎసి చైర్మన్ ఎస్ సురేష్ బాబు
తిరుపతి రెవెన్యూ మేజర్ న్యూస్
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కలిసిన ఏపీ జెఎసి చైర్మన్ ఎస్ సురేష్ బాబు
రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు కేటాయించేటప్పుడు వారి వయస్సు, ఆరోగ్య పరిస్థితులు, వ్యక్తిగత ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని ఏపీజేఏసీ తిరుపతి జిల్లా నాయకులు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారిని ఎస్ వెంకటేశ్వర్లు కోరారు.
ఇటీవల జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఉపాధ్యాయులను సుదూర ప్రాంతాలకు పంపడం, 60 సంవత్సరాలు దాటిన వారికి కూడా ఎన్నికల విధులు కేటాయించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల విధులు సమీప మండలాల్లో కేటాయించాలని, 55 సంవత్సరాలు దాటిన వారికి రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి విధుల నుంచి, 60 సంవత్సరాలు దాటిన వారికి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే ప్రత్యేక అవసరాలు కలిగిన ఉద్యోగులు, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, పిల్లల వివాహాలు తదితర ముఖ్యమైన వ్యక్తిగత కారణాలు ఉన్నవారికి అభ్యర్థనల మేరకు మినహాయింపులు కల్పించాలని కోరారు.
గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్టమైన భద్రత కల్పించాలని, రిజర్వు సిబ్బందికి కూడా పూర్తిస్థాయి రెమ్యునరేషన్ చెల్లించాలని, శిక్షణ తరగతులు, కౌంటింగ్ సమయంలో సిబ్బందికి భోజనం, మంచినీటి సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కౌంటింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు న్యాయబద్ధమైన రెమ్యునరేషన్ చెల్లించాలని కోరారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఏపీజేఏసీ తిరుపతి జిల్లా చైర్మన్ ఎస్. సురేష్ బాబు, జిల్లా సెక్రటరీ ఎస్. వెంకట ముని, ఉమ్మడి చిత్తూరు జిల్లా పూర్వ సెక్రెటరీ జనరల్ కే ముత్యాల రెడ్డి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కోరారు. ఈ కార్యక్రమంలో వి సురేష్ బాబు ఎం శ్రీనివాసులు, హేమగిరి దేవరాల నిర్మల, సి వాసు, లలిత్ కుమార్ గణేష్, సుభాషిని కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి