మామిడి రాంబాబుకు అండగా అల్లం స్వప్న బాలకిషోర్
గీసుగొండ, మేజర్ న్యూస్, శాయంపేట గ్రామానికి చెందిన మామిడి రాంబాబు తీవ్ర కంటి సమస్యతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ప్రజా సేవకులు అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి ఇప్పటికే మానవతా దృక్పథంతో స్పందించి రూ.25 వేలు ఆర్థిక సహాయం అందించిన విషయం తెలిసిందే.తాజాగా ఆయన వైద్య చికిత్సకు మరింత అండగా నిలిచేందుకు మరోసారి రూ.25 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ రెండో విడత ఆర్థిక సహాయాన్ని జిల్లా నాయకులు,గీసుకొండ గ్రామ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్,జిల్లా నాయకులు అల్లం మర్రెడ్డి చేతుల మీదుగా మామిడి రాంబాబుకు అందజేశారు.ఈ కార్యక్రమంలో శాయంపేట మాజీ సర్పంచ్ దామెర నాగార్జున, రాజాబోయిన రజిత,భిక్షపతి యాదవ్,వార్డు సభ్యులు తండా సరస్వతి,మామిడి శ్రీ విద్య పాల్గొన్నారు.అలాగే గ్రామ సీనియర్ నాయకులు రకం అశోక్, రాజాబోయిన మొగిలి, మాసానికి ప్రకాష్,తండ దిలీప్, ముంత శ్రీకాంత్, సముద్రాల వెంకటేష్, బొమ్మగాణి సాయిరామ్, పాశికంటి బంగారి, వెలిషోజు నాగార్జున, సాయికుమార్, సాయికిరణ్, తాళ్లపెళ్లి సందీప్, యూత్ నాయకులు, సీనియర్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొని మామిడి రాంబాబు గారికి ధైర్యం చెప్పారు.ఆపదలో ఉన్న వారికి ఒకసారి సహాయం చేయడమే కాకుండా, అవసరం ఉన్నంతవరకు అండగా నిలవాలనే గొప్ప మనసుతో రెండోసారి కూడా రూ.25 వేలు ఆర్థిక సహాయం అందించడం ద్వారా అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి తన మానవతా దృక్పథాన్ని మరోసారి చాటుకున్నారు.సేవే లక్ష్యంగా, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన నాయకత్వమని నిరూపించారు.
రిపోర్టర్: విష్ణు చందర్, గీసుకొండ, వరంగల్ జిల్లా