నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరాకు ముందస్తు చర్యలుః టిజిఎస్‌పిడిసిఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధి: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ పంపిణీ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాలని టిజిఎస్‌పిడిసిఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో పెరగనున్న విద్యుత్ అవసరాలను ముందుగానే అంచనా వేసి, వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ మేరకు బుధవారం ఆయన హైదరాబాద్‌లోని చిత్రపురి సొసైటీని సందర్శించి, ఐటీ కారిడార్‌లో నూతనంగా ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రతిపాదనను పరిశీలించారు. అనంతరం ల్యాంకోహిల్స్ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను సందర్శించి, అక్కడ చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. అదనంగా 12.5 ఎంవీఏ సామర్థ్యం కలిగిన పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పనులను పరిశీలించారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.