BREAKING
రాణి మల్లమ్మ దేవి పార్కు ను పరిశీలించిన మున్సిపల్ ఎన్నికలు ప్రకృతి వ్యవసాయం రైతుల బాధ్యతగా మారాలి! ముంద్రా ప్లాంట్ పునరుద్ధరణ, సోలార్ వ్యాపారంతో భారీ లాభాలు వీళ్లే విజేతలు ... కందవాడకు ఉచిత అంబులెన్స్‌! శ్రీకాళహస్తి ప్రాంతంలో గంజాయి స్వాధీనం వ్యక్తి అరెస్ట్ వెలమలకి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇవ్వాలి..... * జిల్లా కొప్పుల వెలమ సంక్షేమ సంఘం డిమాండ్ * డేటా సెంటర్లుగా మూతపడిన అణు విద్యుత్ కేంద్రాలు... ఈఓఎన్ సమాలోచనలు పంట అవశేషాలతో జీవ ఇంధన ఉత్పత్తిపై రైతులకు అవగాహన! తెలుగుదేశం పార్టీకి గోవిందరావు చేసిన సేవలు చిరస్మరణీయం బలపడిన అమెరికా డాలర్... ఫెడ్ రేట్ల అంచనాలతో పడిపోయిన బ్రిటిష్ పౌండ్ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు - సిపిఎం వోక్స్ వాగన్ ప్రధాన ప్లాంట్‌లో 'గేమ్‌ఛేంజర్' మోడల్ ఉత్పత్తి నిలిపివేత ముడిచమురు ధరల పెరుగుదల: బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ $92 విశాఖపట్నం వైద్యుల అరుదైన ఘనత: హైదరాబాద్ మహిళకు సంక్లిష్టమైన వెన్నుపాము కణితి తొలగింపు

పారితోషకం జాప్యంపై సిబ్బంది పెదవి విరుపు

Select Suryaa Now
పారితోషకం  జాప్యంపై సిబ్బంది పెదవి విరుపు

పూసపాటి రేగ, సూర్య : మండలంలో తాజాగా జరిగిన ఎంపీటీసీ, పరిషత్తు ఎన్నికల్లో విధుల్లో పాల్గొన్న అధికార సిబ్బందికి అధికారులు పారితోషకాన్ని అందించకపోవడంపై అధికార సిబ్బంది పెతివిరుస్తున్నారు. ఓటర్లు ఓటు వేసేందుకు ఓట్ల స్లిప్పుల పంపిణీ నుంచి ఫలితాలు విలువడే వరకు ఎక్కువగా సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవడంతో పూర్తిస్థాయిలో వాటర్ లకు స్లిప్పులు పంపిణీ చేయలేని పరిస్థితి ఏర్పడడంతో స్లిప్పులను పార్టీల నాయకులకు ఆశ్రయించి ఓటర్లు ఓట్లు వేయాల్సి వచ్చింది. పైన భారం ఎక్కువగా ఉండడం వలన వాటర్ లకు పూర్తిస్థాయిలో ఓట్లు పంపిణీ చేయలేకపోయామని సచివాలయ సిబ్బంది చెప్పినప్పటికీ, ఎన్నికల ఫలితాల వరకు విధుల్లో పూర్తిగా నిమగ్నమైన సచివాలయ సిబ్బందికి కూడా ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన పారితోషకాన్ని సచివాలయ సిబ్బందికి చేరకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విధులకు హాజరైన ఉపాధ్యాయులు కూడా పిఓలుగా ఓపి ఓ లు విధులను నిర్వర్తించినప్పటికీ అనుకున్న సమయానికి ఇవ్వకపోవడంతో మండల విద్యాధికారి మండల పరిషత్ లో ఉన్న అధికార సిబ్బందిని కలిసినప్పటికీ ఎంపీడీవో రాధిక సోమ, మంగళవారాల్లో కార్యాలయానికి రాకపోవడంతో బుధవారం విధులను నిర్వర్తించిన ఉపాధ్యాయులకు కొంతమేర పారితోషకాన్ని అందించారు. బ్యాలెట్ బాక్సులు సంబంధించి హమాలీలను వినియోగించుకునే ప్రొవిజన్ ఉన్నప్పటికీ ఔట్సోర్సింగ్ సిబ్బందితోనే చాకిరీ చేయించుకొని వారికి పారితోష్ కార్డు ఇవ్వకపోవడంపై కూడా పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జోనల్ ఆఫీసర్లుగా పనిచేసిన అధికారులకు కూడా ఆయా అధికారుల సంతకారులను వినియోగించుకున్నప్పటికీ వారికి పెట్రోల్ కి సంబంధించి ఎటువంటి రవాణా భత్యం కూడా అందచేయకపోవడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల రోజున కనీసం మధ్యాహ్నం నాణ్యమైన భోజనాలను ఏర్పాటు చేయకపోవడంతో పాటు కనీసం వాటర్ బాటిల్లను కూడా పంపిణీ చేయడంలో మండల పరిషత్ అధికారులు సిబ్బంది వైఫల్యం చెందారన్న విమర్శలు విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఈ విషయమై సూర్య ఎంపీడీవో రాధికను వివరణ కోరగా ఫండింగ్ పూర్తిస్థాయిలో రాలేదని వచ్చిన మేరకు పంపిణీ చేస్తున్నట్లు వివరణలో పేర్కొన్నారు.