BREAKING
కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలి - సిపిఐ నాయకులు డిమాండ్ మేజర్ పంచాయితీ మనదే కావాలి... * మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ * ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయం - కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సిరాజ్ హుస్సేన్ గాంధీ కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు: కంగనా రనౌత్ ఆరోపణలతో రాజకీయ కలకలం మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం - కలెక్టర్ చిత్రా మిశ్రా మెగాస్టార్ 'విశ్వంభర' డబ్బింగ్ అప్‌డేట్.. త్వరలోనే థియేటర్లలోకి సోషియో ఫాంటసీ వండర్! పిల్లల్లో భాష నైపుణ్యాలను పెంపొందించాలి ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138 జయంతి వేడుకలు పరిషత్ పోరులో కీలక ఘట్టం.. ఎంపీపీ ఎన్నికకు వేళాయే సుడిగాలి సుధీర్ 'గోట్' సినిమా వేదికపై కన్నీటి పర్యూమంతమైన హీరోయిన్ దివ్యభారతి.. అసలు ఏం జరిగిందంటే! చిరు వ్యాపారులపై నోటీసుల పేరుతో వేధింపులా? మండల పరిషత్ "వైస్ ఎంపీపీ"గా అంబటి రాంబాబు? ఇల్లందకుంటలో ఉచిత AI (ఏఐ) శిక్షణ కేంద్రం ప్రారంభం ఆ విజయం పెంచిన బాధ్యతతో వస్తున్నాం.. 'డీఎన్కే' సినిమాపై మౌళి తనూజ్ ప్రశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు! పారమ్మకొండకు పర్యాటక కళ తీసుకొస్తాం

రైతుల సంక్షేమానికి పీఏసీఎస్ పాలకవర్గం కృషి చేయాలి: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Select Suryaa Now
రైతుల సంక్షేమానికి పీఏసీఎస్ పాలకవర్గం కృషి చేయాలి: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్  న్యూస్: రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను మరింత బలోపేతం చేస్తూ రైతులకు మెరుగైన సేవలు అందించాలని తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పంట రుణాలు సకాలంలో అందేలా నూతన పాలకవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు.వికారాబాద్ నియోజకవర్గంలోని శివారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్) నూతన చైర్మన్‌గా నియమితులైన బిల్లపాటి రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం కొండ బాలకృష్ణారెడ్డి గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నూతన చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు.ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ… సహకార సంఘాల ద్వారా రైతులకు ప్రభుత్వ పథకాలు, సేవలు సమర్థవంతంగా అందించాలని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో పీఏసీఎస్‌లు కీలక పాత్ర పోషించాలని సూచించారు. రైతుల అవసరాలను గుర్తించి వారికి అన్ని విధాలుగా అండగా నిలవాలని పేర్కొన్నారు.నూతన చైర్మన్ బిల్లపాటి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు.నూతన పాలకవర్గంలో వైస్ చైర్మన్‌గా టి. మల్లేశం గౌడ్, సభ్యులుగా ధర్మపురం నాగేంద్రమ్మ, మాచాల సరిత, ఎం. సంగప్ప, డి. రమేష్, పట్లోళ్ల ప్రభాకర్ రెడ్డి, ఎం.డి. నైముద్దీన్, బోరెడ్డి రవీందర్ రెడ్డి, చాకలి భుజంగం, కొత్తగాడి నర్సింహులు, ధన్నారం నర్సింహులు, ఎన్. గోవింద్ దాస్ బాధ్యతలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు రంగా రాజు, వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ మల్లేశం, సత్యం సేటు, పట్టణ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన చైర్మన్, పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.