గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: భట్టిప్రోలు మండల పరిధిలో గురువారం పలు ప్రాంతాలలో విద్యుత్తుకు అంతరాయం ఏర్పడుతుందని భట్టిప్రోలు సబ్ స్టేషన్ ఏ ఈ నాగూర్ మీరా బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం గం 08:00 ల నుండి మధ్యాహ్నం గం 02: 00 ల వరకు పెదపులివర్రు సబ్ స్టేషన్ నందు గల 11కేవీ పెదపులివర్రు హెడ్ క్వార్టర్ ఫీడర్ పై మెయింటైనెన్స్ మరియు పిఎంఐ పనుల కారణంగా దాసరిపాలెం, పెదపులివర్రు, కోళ్లపాలెం, ఓలేరు మరియు గొరిగపూడి,
భట్టిప్రోలు ఎస్ ఎస్ పరిధిలో ఉంటాయన్నారు. 11కే వీ సూరేపల్లి ఫీడర్ నందు గల మైటైన్స్ కారణంగా సూరేపల్లి, వేమవరం, తాతావారిపాలెం, కోనేటిపురం, పడమటి వారి పాలెం గ్రామ పరిధిలో గృహ విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు.కావున విద్యుత్ వినియోగదారులు ఈ అసౌకర్యాన్ని గమనించి సహకరించవలసిందిగా ఏ ఈ నాగూర్ మీ రా కోరారు.