BREAKING
చిరుత సంచారం పై అప్రమత్తంగా ఉండండి. అడవి శాఖ అధికారి మల్లికార్జున. బాసర ఐఐఐటీ విద్యార్థులకు నిరంతరం సురక్షిత తాగునీరు అందించాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా నెల్లిమర్లలో వామపక్షాల నిరసన * ఎస్ఈసీ రాజీనామాకు డిమాండ్ * సూపర్ హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్ మెకా.. గ్రాండ్‌గా కొత్త చిత్రం ప్రారంభం! రైతులు రైతు గుర్తింపు కార్డులో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి విద్య ద్వారానే అభివృద్ధి * ప్రధానోపాధ్యాయులు డాక్టర్ జె సి రాజ్ * యాదవుల వీరత్వానికి ప్రతీక సదర్ సమ్మేళనం రామతీర్థం శ్రీరామస్వామి ఆలయ హుండీల ఆదాయం రూ.21,89,335 ఉన్నత విద్యావంతుడు సర్పంచ్ అయితే గ్రామ రూపురేఖలు మారుతాయి! గ్రామాభివృద్ధి, అవినీతి రహిత పాలనే లక్ష్యంగా వీరవల్లి శివరామకృష్ణ ఎం.టెక్‌, ఎఫ్‌.ఐ.ఈ., న్యాయశాస్త్రంలో పీజీ పట్టా.. ప్రస్తుతం న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ పరిశోధన రూ.60 లక్షలతో నిర్మించిన మల్టీపర్పస్ సెంటర్‌ను ప్రారంభించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్ కరువు పరిస్థితుల్లో రైతు కుటుంబాలను వేధించడం సరికాదు - మాజీ మంత్రి జోగు రామన్న. నూతన దుర్గాభవాని ఫర్టిలైజర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గోడపత్రిక విడుదల ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కలిసిన ఏపీ జెఎసి చైర్మన్ ఎస్ సురేష్ బాబు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఒపీ జిందాల్ భారతి స్కూల్ విద్యార్థులు

నేడు మాదాపూర్ తమ్మిడికుంట చెరువు ప్రారంభం

Select Suryaa Now
నేడు మాదాపూర్ తమ్మిడికుంట చెరువు  ప్రారంభం
హైదరాబాద్: ఐటీ కారిడార్‌లోని ప్రముఖ ప్రాంతం మాదాపూర్‌లో ఆక్రమణలు, వ్యర్థాలతో కలుషితమైన తమ్మిడికుంట చెరువు సరికొత్త శోభను సంతరించుకుని ప్రారంభానికి సిద్ధమైంది. పునరుద్ధరించిన ఈ చెరువును బుధవారం సాయంత్రం 6 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించనున్నారు.

గతంలో ఆక్రమణల బారినపడి కేవలం 12 ఎకరాలకు మాత్రమే పరిమితమై, మురుగు వ్యర్థాలతో నిండిపోయిన తమ్మిడికుంట చెరువును హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) ప్రతిష్టాత్మకంగా తీసుకుని పునరుద్ధరించింది. ఆక్రమణలను తొలగించి, చెరువును ఏకంగా 30 ఎకరాల విస్తీర్ణానికి విస్తరించడంతో పాటు పరిసర ప్రాంతాలను ఎకో-ఫ్రెండ్లీ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దింది.

వాకింగ్ ట్రాక్‌లు, ల్యాండ్‌స్కేపింగ్, సందర్శకుల కోసం మౌలిక వసతులతో తీర్చిదిద్దిన ఈ చెరువు, ఐటీ హబ్ మాదాపూర్ పరిధిలో మరో కీలకమైన ల్యాండ్‌మార్క్‌గా మారింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.