సాయిబాబాను సత్కరిస్తున్న టిడిపి శ్రేణులు
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలలో కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థుల అఖండ విజయానికి కృషిచేసిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూ నుగుంట్ల సాయిబాబాను పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు దుశ్యాలువాలతో, పూల బొకేలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని నాలుగు సెగ్మెంట్ల అభ్యర్థుల నామినేషన్ల పర్వం నుండి, ఎన్నికలు, మరియు కౌంటింగ్ పూర్తయ్యే వరకు అలుపెరగక, తన వయసును కూడా లెక్క చేయక అభ్యర్థుల విజయానికి అవిరల కృషి చేశారన్నారు. ఒకటో సెగ్మెంట్ నుండి నాలుగు సెగ్మెంట్ల వరకు అధిక మెజారిటీతో అభ్యర్థుల గెలుపుకు కృషి చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా జడ్పిటిసి అభ్యర్థి నక్క శ్రీనివాసరావు గెలుపు కూడా ఈ అభ్యర్థుల విజయం తోడ్పాటు నందించిందన్నారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పెద్దలంక సుబ్బారావు, పెదలంక వెంకట నాంచారయ్య, పగడాల శీను, బెల్లంకొండ రవి తదితరులు పాల్గొన్నారు.